Robinhood Rlease: రాబిన్‌హుడ్‌ గుండెల్లో గుబులు!

Robinhood Rlease : హీరో నితిన్‌, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లోని 'రాబిన్‌హుడ్‌' సినిమా రిలీజ్‌ వాయిదా పడే చాన్సెస్‌ ఉన్నాయి.

Viswa
2 Min Read
nithin Robinhood movie Release may Postponed

Web Stories

Robinhood Rlease: హీరో నితిన్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లోని ‘భీష్మ’ సినిమా హిట్‌గా నిలిచింది. కోవిడ్‌ భయాం దోళనలు నెలకొన్న సమయంలో రిలీజై ‘భీష్మ’ సినిమా హిట్‌గా నిలిచింది. సరైన సమయంలో రిలీజై ఉంటే కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ స్టేటస్‌ను దక్కించుకునేది.

అయితే కొంత గ్యాప్‌ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుములలు కలిసి ‘భీష్మ’ తర్వాత ‘రాబిన్‌ హుడ్‌’ అనే మూవీ చేశారు. ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమేన్‌’ తర్వాత నితిన్, శ్రీలీల మళ్లీ ఈ మూవీ కోసం జోడీ కట్టారు. మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తొలుత 2024 డిసెంబరు 20న రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు. వీలుపడకపోవడంతో సంక్రాంతికి ప్రయత్నించి, ఫైనల్‌గా మార్చి 28కి రిలీజ్‌ని ఫైనల్‌ చేసుకున్నారు.

కానీ రాబిన్‌హుడ్‌ రిలీజ్‌ ఫైనల్‌ కావడానికి ముందే, పవన్‌కల్యాణ్‌ హరిహరవీరమల్లు మూవీ మార్చి 28 రిలీజ్‌ను ఫిక్స్‌ చేసుకుంది. కానీ హరిహరవీరమల్లు మూవీ రిలీజ్‌పై సందేహాలు రావడంతో మార్చి 28ని రిలీజ్‌కు ప్రకటించింది రాబిన్‌హుడ్‌ అండ్‌ టీమ్‌.

కానీ మార్చి 28న ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ‘హరిహరవీరమల్లు’ సినిమాను రిలీజ్‌ చేసి తీరాతామని ఈ చిత్రం నిర్మాత ఏఎమ్‌ రత్నం చెబుతున్నారు. పవన్‌కల్యాణ్‌ నుంచి ఓ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. పైగా పవన్‌ ఇప్పుడు పవర్‌లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో పవన్‌కల్యాణ్‌ సినిమా అంటే రిజల్ట్‌తో సంబంధం లేకుండా, థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ పడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘రాబిన్‌హుడ్‌’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకుంటేనే బెటర్‌ అనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

‘భీష్మ’ సినిమా సరైన సమయంలో రిలీజ్‌ కాలేదు. దీంతో సరైన ఫలితం రాలేదు. కనీసం ఈ సారైనా సరైన జాగ్రత్తలు పాటించి, నితిన్‌ అండ్‌ టీమ్‌ హిట్‌ కొట్టాలి. ఎందుకుంటే ప్రస్తుతం నితిన్‌ కెరీర్‌ ఓ హిట్‌ కచ్చి తంగా అవసరం. ఇక నితిన్‌ నటించిన మరో మూవీ ‘తమ్ముడు’ ఈ శివరాత్రికి రిలీజ్‌ కావాల్సింది. కానీ రిలీజ్‌ వాయిదా పడింది. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా కొత్త విడుదల తేదీపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

Please Share
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak