రాజమౌళి వల్ల కావడం లేదు!

Viswa
1 Min Read

Web Stories

Mahesh Babu’s ‘Varanasi’ Movie: బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ రాజమౌళి లేటెస్ట్‌ మూవీ ‘వారణాసి’. ఇందులో మహేశ్‌బాబు హీరో. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్, ప్రకాష్‌రాజ్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం వాటర్‌లో సాగే ఫైట్‌ చిత్రీకరణ జరుగుతోంది. వారణాసి ప్రాంతంలోని గంగానదీలో ఫైట్‌ అన్నమాట. ఇందంతా..ఓ వీడి యో రూపంలో బయటకు వచ్చింది.

వారణాసి మూవీ నుంచి ఇలాంటి ఓ లీక్‌ రావడం ఇది మూడోసారి. ఈ సినిమా ప్రారంభంలోనే ఓడిస్సా లొకేషన్స్‌లో వారణాసి సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు, మహేశ్‌బాబు–పృథ్వీరాజ్‌సుకుమారన్‌లోని సీన్‌ ఒకటి లీకైంది. ఇది సినిమాలో కీలకమైన సీన్‌ కావడంతో, యూనిట్‌ బాగా అప్‌సెట్‌ అయ్యింది. ఆ ఇదే ‘వారణాసి’ సినిమాలో మహేశ్‌బాబు రాముడి పాత్రలో నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. ‘వారణాసి’ సినిమా లీక్స్‌ (Varanasi movie Leaks) ఇంతటితో ఆగలేదు.

‘వారణాసి ది వరల్డ్‌’ గ్లింప్స్‌ వీడియో ముందురోజే లీకైంది. ఈ విషయాన్ని రాజమౌళియే (Director SSRajamouli) స్పష్టం చేశారు. క్రేజీ ప్రాజెక్ట్‌ కావడంతో, ఇలా వరుస లీక్‌లు బయటకు వస్తుండటం మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ను కలవరపెడు తోంది. టీమ్‌ కూడ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఈ సోషల్‌మీడియా యుగంలో.. అవుట్‌డోర్‌ షూటింగ్‌ సమయంలో ఇది తప్పడం లేదు. అయితే ఈ లీక్‌లను కంట్రోల్‌ చేయడంలో అయితే రాజమౌళి ఫెయిల్‌ అవుతున్నారు. భవిష్యత్‌లో ‘వారణాసి’ యూనిట్‌ నుంచి మరో లీక్‌ ఏదైనా బయటకు వచ్చిందంటే… అంతే..! ఈ ప్రభావం కచ్చితంగా సినిమాపై పడుతుంది. మరో లీక్‌ బయటకు రాకూడదనే కోరుకుందాం.

ఎస్‌ఎస్‌ కార్తీకేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ ‘వారణాసి’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న రిలీజ్‌ కానుంది. ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi