నితిన్‌ తమ్ముడు హిట్టా? ఫట్టా?

Viswa
nithin Tammudu movie Trailer

ఓ మంచి హిట్‌ కోసం నితిన్‌ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాడు. సినిమాలు చేసుకుంటు వెళ్తున్నాడు. కానీ ఓ మంచి హిట్టైతే రావడం లేదు. ఇప్పటికే నితిన్‌ సినిమాలు వరుసగా ఏడు ఫ్లాప్‌ అయ్యాయి. తాజాగా ఆయన హీరోగా నటించిన తమ్ముడు సినిమా థియేటర్స్‌కు వచ్చింది. మరి..ఈ తమ్ముడు సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ మై ఫ్రెండ్‌, వకీల్‌సాబ్‌ చిత్రాలను తీసిన వేణు శ్రీరామ్‌ దర్శకుడు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మించారు.

 

సినిమా: తమ్ముడు (Nithiin’s Thammudu Review)

ప్రధాన తారాగణం: నితిన్‌, లయ, సప్తమి గౌడ, స్వసిక, వర్ష బొల్లమ్మ, బేబీ దిత్య, సౌరభ్‌, టెంపర్‌ వంశీ, శ్రీకాంత్‌ అయ్యంగర్‌
దర్శకత్వం: వేణు శ్రీరామ్‌
నిర్మాణం: దిల్‌ రాజు, శిరీష్‌
మ్యూజిక్: అజనీష్‌ లోకనాథ్‌
కెమెరా: కేవీ గుహాన్‌
ఎడిటింగ్‌:ప్రవీణ్‌ పూడి
విడుదల తేదీ: జూలై 4, 2025 (Thammudu Release date)
నిడివి:2 గంటల 34 నిమిషాలు

రేటింగ్‌: 1.75/5.0

కథ

ఓ ఫ్యాక్టరీలో భారీ బ్లాస్ట్‌ జరిగి భారీ సంఖ్యలో జనాలు చనిపోతారు. ఈ కేసులో తమకు న్యాయం జరగాలని విశాఖపట్నం కలెక్టరేట్‌ ముందు బాధితులు నిరాహారక దీక్షకు దిగుతారు. దీంతో ఈ కేసు పరిష్కారానికి ప్రభుత్వం ఓ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసి, ఓ రిపోర్ట్‌ను కలెక్టర్‌కు అందించా ల్సిందిగా చెబుతుంది. ఈ కమిటీలో కీలకమైన ఝాన్సీ కిరణ్మయి (లయ)ని బెదిరించి, ఫ్యాక్టరీ ఓనర్‌ అజర్వాల్‌ (సౌరభ్‌) ఆ రిపోర్ట్‌ను తనకు అను కూలంగా మార్చుకోవాలని చూస్తాడు. ఈ క్రమంలో అంబరగొడుగులో జరిగే పగడాలమ్మ జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి ఝాన్సీ వెళ్లిందని తెలుసుకుని, తన అనుచర గణాన్ని పంపి, ఝాన్సీని చంపామంటాడు (Thammudu Review).

మరోవైపు ఆర్చరర్‌గా ఇండియాకు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ తీసుకురావాలని జై (నితిన్‌) ప్రయత్నిస్తుంటాడు. కానీ ప్రాక్టీస్‌లో గేమ్‌పై ఫోకస్‌ పెట్టలేకపోతుంటాడు. దీంతో తన అక్క ఝాన్సీ తనకు దూరకావడం, తన అక్క పెళ్లి విషయంలో తాను చేసిన ఓ తప్పు తనను గిల్ట్‌ ఫీల్‌ అయ్యేలా చేస్తుందని, ఈ గిల్ట్‌ ఫీలింగ్‌ వల్లే తాను గేమ్‌పై ఫోకస్‌ పెట్టలేకపోతున్నాననిగ్రహిస్తాడు. వెంటనే అక్కను కలుసుకునే ప్రయత్నం స్టార్ట్‌ చేస్తాడు. ఈ క్రమంలో తన ఝాన్సీ, ఆమె కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకుని సాయంగా నిలబడతాడు.మరి..ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన తన తమ్ముడు జై ని, ఝాన్సీ గుర్తుపెట్టుకుంటుందా? ఝాన్సీ పెళ్లి విషయంలో జై చేసిన తప్పు ఏమిటి? ప్రభుత్వం అధికారిగా ఝాన్సీకి ఆ రిపోర్ట్‌ను సబ్‌మిట్‌ చేయడంలో ఎదురైనా సవాళ్లు ఏమిటి? ఫైనల్‌గా అజర్వాల్‌కు ఎలాంటి శిక్ష పడింది? జై జీవితంపై చిత్ర (వర్ష బొల్లమ్మ), రత్న (సప్తమి గౌడ), గుత్తికుంట (స్వసిక)ల ప్రభావం ఎంత మేరకు ఉంది? అన్న విషయాలను వెండితెరపై చూడాలి.

Thammudu Review: విశ్లేషణ

అక్కయ్య మాటను నిలబెట్టేందుకు ఓ తమ్ముడు చేసిన సాహసోపేతమైన ప్రయాణమే ‘తమ్ముడు’ (Thammudu Cinema Review)సినిమా. కథ పరంగా స్టోరీ సింపుల్‌ లైన్‌ ఇదే. అక్కా-తమ్ముడి సెంటిమెంట్‌తో చాలా సినిమాలొచ్చాయి. కానీ మేజర్‌ సినిమాలు ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. కానీ తమ్ముడు సినిమా అలా కాదు. సర్‌వైవల్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఉండే ఓ డిఫరెంట్‌ మూవీ. జానర్‌ అయితే డిఫరెంట్‌గా ఉంది కానీ దర్శకుడు శ్రీరామ్‌ వేణు ఎగ్జిక్యూషన్‌ మాత్రం ఫెయిల్‌ అయ్యింది.

‘తమ్ముడు’ సినిమా 24 గంటల్లో జరుగుతుంది. గతంలో ఈ తరహాలో వచ్చిన ‘ఖైదీ, మ్యాక్స్‌’ వంటి చిత్రాలు ఆడియన్స్‌ను అలరించాయి. కానీ ‘తమ్ముడు’ మాత్రం ఫెయిల్‌ అయ్యాడు. కథలో నాటకీయత లేదు. ప్రేక్షకులపై బలవంతంగా భావోద్వేగాలను రుద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీరామ్‌ వేణు. మొక్కు తీర్చుకోవడం కోసం అంబరగొడుకు వెళ్లిన హీరోయిన్‌ ఫ్యామిలీలో ఒకరు ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భవతి ఉండటం, ఝాన్సీ కుమార్తెకు యాంగ్జైటీ డిజార్డర్‌ అంటూ…ఈ రెండు పాత్రల చుట్టూ రెండు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు పెట్టడం అనేది ఏ మాత్రం వర్కౌట్‌ కాలేదు. ఆడియన్స్‌పై ఫోర్డ్స్‌ ఎమోషన్స్‌ను ప్రయోగించనట్లుగా ఉంటుంది.

Nithammudu Cinema Review
Nithammudu Cinema Review

 

ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌లో చాలా బాగుంటాయని ఈ చిత్రం నిర్మాత ‘దిల్‌’ రాజుతో పాటుగా, టీమ్‌ అందరూ నమ్మారు. కానీ ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ వర్కౌట్‌ కాలేదు. ఈ యాక్షన్‌ బ్లాక్స్‌ స్క్రీన్‌పై రిచ్‌గానే కనిపిస్తున్నాయి. కానీ..కథలో బలం లేకపోతే కథానాయకుడు ఎన్ని ఫైట్స్‌ చేస్తే మాత్రం ఏం లాభం ఉంటుంది. ఇక నాలుగు ఊర్ల ప్రజలను నితిన్‌ ఒక్కడే చంపుతూ ఉండ టం, ఈ క్రమంలో నితిన్‌ చివరి వరకు పోరాడుతూ ఉండటం అనే అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది చాలదంటూ.. .చిత్ర, గుత్తిల మధ్య ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ కూడా సినిమాలకు బలంగా నిలవలేకపోయింది. ఇక ఝాన్సీ పాత్ర చెప్పే రెండు జన్మల థియరీ అయితే..ఈ కథ అంత అవుట్‌డెటెడ్‌నో ఆడియన్స్‌కు అర్థం అయ్యేలా చేస్తుంది. ఇక విలన్‌ పాత్ర అజర్వాల్ ఉండే సౌండ్‌ డిజార్డర్‌ కూడా, అతని పాత్ర చిత్రణ కూడా ఆడియన్స్‌కు విసుకు తెప్పిస్తుంది. అజర్వాల్‌ డిజార్డర్‌ గురించి ఓ సారి చెబితే సరిపోతుంది. అలాంటిది అతని పాత్ర వచ్చిన ప్రతిసారి దాన్ని ఎలివేట్‌ చేయడం, ప్రతి సీన్‌లో విలన్‌ తన దగ్గర పనిచేస్తున్న ఒకర్ని చంపుతూ ఉండటం అనేది ఏంటో దర్శకుడికే తెలియాలి.

సినిమాలో ”సీయంకు వంద కోట్లు..నాకు పది కోట్లు.. ఇస్తే ప్రాబ్లమ్‌ సాల్వ్‌.నిజనిర్థారణ కమిటీని మేం మ్యానేజ్‌ చేస్తాం అన్నట్లుగా ఓ రాజకీయ నాయ కుడు చెబుతాడు’..అసలు కథలో ఆ తర్వాత రాజకీయ కోణమే ఉండదు. దర్శకుడు కథపై మరింత కసరత్తు చేయాలన్నందుకు ఈ అంశం ఓ నిద ర్శనం.

Thammudu Cast and CrewReview నటీనటుల పెర్ఫార్మెన్స్‌

జై పాత్రలో నితిన్ యాక్టింగ్‌ ఎప్పటిలానే ఉంది. కాకపోతే కాస్త సెటిల్డ్‌ యాక్టింగ్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఉన్నంత బాగానే చేశాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం కష్టపడ్డాడు. కానీ కథ ఎంపిక లో విఫలమైయ్యాడు. చాలా కాలం తర్వాత లయ ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ తమ్ముడు సినిమాలో లయ చేసిన ఝాన్సీ కిరణ్మయి పాత్రపవర్‌ఫుల్‌గా ఉండాల్సింది. కానీ ఎక్కడికక్కడ ఆత్మహత్య ప్రాబ్లమ్‌కు సొల్యూషన్‌ అంటూ ఉండటం బాగోలేదు. ఇలా బలంగా ఉండాల్సిన ఈ పాత్ర బలహీనమైపోయింది. అంబర గొడుగులో ఉండే రత్న పాత్రలో సప్తమి గౌడ్‌ ఉన్నంతలో మెప్పించింది. ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేసే కాల్‌సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌గా బాగానే చేసింది. చిత్ర పాత్రలో వర్ష బొల్లమ్మ, గుత్తి పాత్రలో స్వసిక, దిత్యలకు కథలో మంచి వెయిట్‌ ఉన్న రోల్స్‌ దక్కాయి. వర్ష, స్వసికల మధ్య ఉండే యాక్షన్‌ సీక్వెన్స్‌ ఒకే. దిత్య పాత్ర రోటీన్‌గా ఉంటుంది. ఇకవిలన్‌ పాత్రలో సౌరభ్‌ కనిపించాడు. డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. ఫ్రాన్సిస్‌గా టెంపర్‌ వంశీ తన పాత్ర పరిధి మేరకు ఓ విలన్‌గా కని పించాడు. ఈ సినిమాకు అజనీష్‌ లోకనాథ్‌ మ్యూజిక్‌ బలంగా ఉండ లేకపోయింది. ఆర్‌ఆర్‌ ఒకే. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు ఉన్న తంగా ఉన్నాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త చేయవచ్చు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లలో.

ఫైనల్‌గా..ఫ్లాప్స్‌ల విషయంలో నితిన్‌ ‘అనుగఛ్చతి ప్రవాహా

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *