సినిమా తీయడం ఒక ఎత్తైతే, ఆ సినిమా ఓటీటీ, శాటిలైట్ డీల్స్‌ని పూర్తి చేసుకుని, థియేటర్స్ లో రిలీజ్ రావడం మరో ఎత్తు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియం రేంజ్ సినిమాలు విడుదల కావ డం అంతా ఓటీటీ సంస్థ చేతుల్లోనే ఉంది. ఎలాగో అలా అన్ని పనులను పూర్తి చేసుకున్న తమ్ముడు సినిమా జూలై 4న (nithin Tammudu Release) రిలీజ్‌కు సిద్ధమైంది. ఇంతలో పవన్ కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’, విజయ్‌దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాల రిలీజ్‌ల విషయంలో సందిగ్దత నెలకొని ఉంది. ఈ ఎఫెక్ట్ ‘తమ్ముడు’ ((nithin Tammudu )సినిమా రిలీజ్‌పై పడింది. తమ్ముడు సినిమా జూలై 4న విడుదల కాని, పరిస్థితి.
కానీ ఇంతలో సమీకరణాలన్నీ మారిపోయాయి. జూలై 4 రిలీజ్ ప్రకటించుకున్న ‘కింగ్‌డమ్’ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అంటున్నారు. మరోవైపు ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 18న విడుదల అంటున్నారు. ఈ తరుణంలో తమ్ముడు రిలీజ్‌కి మార్గం సులువైంది. ఇలా ‘తమ్ముడు’ సినిమా ముందుగా అనుకు న్నట్లుగానే జూలై 4న ((nithin Tammudu movie )రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇలా జరగడం నిజంగా అదృష్టమే. మరి..అదృష్టం తమ్ముడు సినిమాకు కలిసొచ్చి, ఈ సినిమా హిట్ అవుతుందెమో చూడాలి.
కొంతకాలంగా హిట్ లేని నితిన్ ఈ తమ్ముడు సినిమాలో హీరోగా చేశాడు. ‘కాంతార’ ఫేమ్ సప్తిమిగౌడ హీరోయిన్. లైలా మరో కీ రోల్ చేశారు. వేణు శ్రీ రామ్ డైరెక్టర్. ‘దిల్’ రాజు నిర్మాత. నిజానికి ‘తమ్ముడు’ సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 28నే రిలీజ్ చేద్దామ నుకున్నారు. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా జూలై 04న రిలీజ్ చేస్తున్నారు.