NTR Dragon Movie : ఎన్టీఆర్ హిందీలో చేసిన స్ట్రయిట్ మూవీ ‘వార్ 2’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కాస్త నిరు త్సాహానికి గురైయ్యాడు ఎన్టీఆర్. కానీ కొంతగ్యాప్ తీసుకుని, ‘డ్రాగన్’ సినిమా చిత్రీ కరణకు రెడీ అవుతున్నాడు. కర్ణాటకలో ఓ లెంగ్తీ షూటింగ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశాడు ఎన్టీఆర్. ప్రస్తు తం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కానీ ఎన్టీఆర్ లేని సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నారు (NTR Dragon Movie).
మరి..ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నారంటే…యూనైటెడ్ స్టేట్స్‌లో ఉన్నారు. ఎందుకంటే ‘డ్రాగన్’ సినిమా నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ అక్కడే ప్రారంభం కానుందని తెలిసింది. ఎన్టీఆర్ ఇప్పటికే యూఎస్ వెళ్ళారు. డ్రాగన్ సినిమాను యూఎస్‌లోనే కాదు.. ఇతర దేశాల్లోనూ చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘డ్రాగన్’ సినిమాను దాదాపు పది దేశాలకు పైగా లొకేషన్స్‌లో చిత్రీకరిస్తారట. కథకు ఇంటర్‌నేషన్ టచ్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. డ్రాగన్ కథ ప్రధానంగా 1969లో జరుగుతుందని తెలిసింది.
Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl
— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025
అయితే ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా స్లిమ్‌గా మారిపోయాడు. అంతేకాదు..ఎన్టీఆర్ జిమ్‌లో శ్రమిస్తున్న వర్కైట్ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్ కష్టపడుతున్న తీరు, ఆయన అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తుంది. అయితే ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్‌లో స్లిమ్‌గా కనిపిస్తున్నారు. దీన్ని బట్టి.. .‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు..ఈ డ్రాగన్ సినిమాలో కాంతార ఫేమ్ రిషబ్‌శెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లోని ఈ డ్రాగన్ మూవీలో రుక్మీణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టోవినో థామస్ విలన్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ ‘డ్రాగన్’ చిత్రం జూన్ 25, 2026న విడుదల కానుంది.