NTR Dragon Postponed: హీరో ఎన్టీఆర్ (Ntr), దర్శకుడు ప్రశాంత్‌నీల్ (PrashanthNeel) కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ (Dragon) అనే సినిమా తెరకెక్కుతోంది. కానీ ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల ఎన్టీఆర్ తీవ్ర అహనంగా ఉన్నారని, ఈ విషయంలో ఎన్టీఆర్- ప్రశాంత్‌నీల్‌కు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయనే టాక్ తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్‌లు ఏకాభిప్రాయంపై లేకపోవడం వల్లే డ్రాగన్ సినిమా తుదితరి షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ కావడం లేదనే టాక్ కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
ఇన్ని రోజులు జరిపిన ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఫుటేజ్‌లో ఎన్టీఆర్ మేజర్ మార్పులు కోరాట. ఇది ప్రశాంత్‌నీల్‌కు నచ్చలేదనే పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు..’డ్రాగన్’ సినిమా కథను కూడ మార్చబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్ట్‌పై ఇలా నెగటివ్ ఊహాగానాలు వినిపిస్తున్న వేళ మేకర్స్ నుంచి ఓ పాజిటివ్ నోట్ ఏదైనా వస్తే బాగుంటుందని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. మరి..ఏం జరుగుతుందో చూడాలి. అసలే..’వార్2′ సినిమా రిజల్ట్ ఎన్టీఆర్‌ను ఇబ్బంది పడుతున్న వేళ, ఇప్పుడు ఈ ‘డ్రాగన్’ సినిమా ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఎన్టీఆర్‌కు తప్పుకుండ మైనస్ అనే చెప్పుకోవాలి.
ఇక డ్రాగన్ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా చేస్తున్నారు. కల్యాణ్‌రామ్, కొసరాజు హరిక్రిష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత డ్రాగన్ సినిమాను జనవరి 09, 2026న రిలీజ్‌కు ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత జూన్ 25కి వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘డ్రాగన్’ సినిమా జూన్ 25న రాకపోవచ్చని, ఈ సినిమా వాయిదా పడ్డట్లే అని ఊహించవచ్చు. ఇక రీసెంట్‌గా ‘డ్రాగన్’ సినిమాను 2026లోనే విడుదల చేస్తామని ‘డ్రాగన్’ సినిమా నిర్మాతలు చెప్పారు. దీన్ని బట్టి, ‘డ్రాగన్’ సినిమా 2026 చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ремонт бойлеров на дому https://remont-boyler-na-domu.ru/