ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌నీల్ (కేజీఎఫ్, సలార్) చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘డ్రాగన్’ (NTR Dragon shoot) చిత్రీకరణకు సర్వం సిద్ధమైంది. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ఫిబ్రవరి 20న ప్రారంభించి, కొత్త షూటింగ్ జరిపారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఆ మాటొకొస్తే..‘డ్రాగన్’ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ ఇంతవరకు పాల్గొనలేదు.
కానీ రేపటి నుంచి కర్ణాటక శివర్లాలో వేసిన ఓ భారీ సెట్‌లో ‘డ్రాగన్’ (Dragon) షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ముందుగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నారనే టాక్ వినిపించింది.
ఈ యాక్షన్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఓ ఫారెస్ట్ సీక్వెన్స్‌లో పాల్గొంటారు ఎన్టీఆర్. ఈ ఏపిసోడ్ సిని మాలో హీరో ఎంట్రీ సీన్‌గా ఉంటుందట. ఫారెస్ట్‌లో జరిగే ఈ చేజింగ్ సీన్ మూవీకి హైలైట్‌గా ఉంటుందట.
ఈ మూవీ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, రుక్ష్మిణీవసంత్ హీరోయిన్‌గా చేస్తారని, మలయాళ యువ నటుడు టోవినోథామస్ విలన్‌గా చేస్తారనే ప్రచారం సాగుతోంది.
ఏప్రిల్ 22న మొదలైయ్యే ‘డ్రాగన్’ (NTR31) కొత్త షూటింగ్ షెడ్యూల్ మే మూడోవారం వరకూ జరుగుతుంది. ఆ తర్వాత …‘వార్ 2’లో బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూట్‌లో పాల్గొంటారు ఎన్టీఆర్. మళ్లీ కొంత ‘డ్రాగన్’ టాకీ పార్ట్‌ను పూర్తి చేసిన పిదప, జూలై స్టార్టింగ్ నుంచి ‘వార్ 2’ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ఎందుకంటే..వార్ 2 మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది.
‘డ్రాగన్’ తర్వాత ‘దేవర 2’ షూటింగ్‌లో పాల్గొంటారు ఎన్టీఆర్. ఆ నెక్ట్స్ నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ మూవీ ఉండొచ్చు. సూర్యదేవరనాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తారు.
WGkc WYvBik HASZBf