NTR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా కోసం ఎన్టీఆర్ ఐదేళ్ల సమయాన్ని వెచ్చించారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఎన్టీఆర్‌కు తాను ఊహించిన ఫలితం అయితే రాలేదు. ఈ చిత్రంలో మరో హీరోగా చేసిన రామ్‌చరణ్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్’కు మేజ ర్ క్రెడిట్ దక్కిందన్నది నిజం. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుంచి ‘దేవర’ వచ్చింది. విడుదలైన తొలి రోజే ‘దేవర’కు కాస్త మిక్డ్స్‌టాక్ వచ్చింది. ఫ్యాన్స్ సహాయంతో ‘దేవర’ (Devara) సినిమా హిట్ స్టేటస్‌ను దక్కించు కుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ‘వార్ 2’ (War2) అనే హిందీ మూవీ చేస్తున్నారు. ఇందులో హృతిక్‌రోషన్ మరో హీరోగా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్టర్. హిందీ డైరెక్టర్ కాబట్టి హృతిక్‌రోషన్ రోల్‌కే ఎక్కవ ఇంపార్టెన్స్ ఉంటు ంది. పైగా ‘వార్’ సినిమాలో హృతిక్‌రోషనే హీరో కాబట్టి ‘వార్ 2’లో కూడా హృతిక్‌రోషన్ క్యారెక్టరే హైలైట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. ఇలా ‘వార్ 2’లో ఎన్టీఆర్ ఓ లీడ్‌గానే ఉండిపోతుంది. హీరో క్రెడిట్ అయితే లభించదు. ఆగస్టు 14న ఈ మూవీ విడుదల కానుంది. ఇలా ఈ ఏడాది ఎన్టీఆర్ సోలో హీరోగా సినిమా వచ్చే చాన్సెస్ లేవు.

మరోవైపు ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2026 జనవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇలా సోలో హీరోగా ఎన్టీఆర్‌కు, ఆడియన్స్‌కు చాలా గ్యాప్ ఉంటోంది. మరోవైపు ఈ ఏడాది రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్, పెద్ది’ సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రభాస్ ‘రాజాసాబ్, ఫౌజీ’ చిత్రాలకు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరో నాలుగు సినిమాలను సోలో హీరోగా లైన్లో పెట్టాడు ప్రభాస్. సోలో హీరోగా రాజమౌళితో మహేశ్‌బాబు భారీ మూవీ చేస్తున్నారు. రిలీజ్ లేటైనా మహేశ్‌బాబుకు నష్టం లేదు. ఈ మూవీతో గ్లోబల్ రేంజ్‌లో పాపు లర్ అవుతాడు. పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. కొత్త రికార్డ్స్ కూడా నమోదు అయ్యాయి. కాబట్టి..అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ కొంత ఆలస్యమైనా పెద్ద ఇబ్బంది అల్లు అర్జున్‌కు ఉండదు. ‘పుష్ప2’తో అల్లు అర్జున్‌కు హిందీలో పెద్ద మార్కెట్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. ఎటొచ్చి ఎన్టీఆర్‌కు ఇబ్బంది. ఈ సమయంలో ఎన్టీఆర్ సినిమాల విషయంలో కాస్త స్పీడ్ పెంచితేనే బాగుంటుంది. పైగా ఎన్టీఆర్ గత చిత్రం ‘దేవర’ కూడా పెద్ద బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసింది లేదు.