‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్, హీరో ఎన్టీఆర్ తొలిసారి (NTR With Trivikram) కలిసి పని చేశారు. ఆ తర్వాత మరోమారు ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లు కలిసి పనిచేయాల నుకు న్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోని 30వ సినిమాగా, ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఏమైందో ఏమో కానీ.. ఈ మూవీ సడన్‌గా ఆగిపోయింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని అందుకే ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని మరో మూవీని గురించిన ప్రకటనలు అయితే రాలేదు.
అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లుంది. ‘పుష్ప ది రూల్’ సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సింది. కానీ ‘పుష్ప: ది రూల్’ మూవీ మ్యాసివ్ సక్సెస్‌తో, దర్శకుడు త్రివిక్రమ్‌ను హోల్డ్‌లో పెట్టి, తమిళ దర్శకుడు అట్లీకి చాన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్. దీంతో త్రివిక్రమ్ నొచ్చుకున్నాడు. అల్లు అర్జున్‌కు చెప్పిన కథతోనే ఎన్టీఆర్‌తో (NTR With Trivikram) సినిమా చేసేందుకు త్రివిక్రమ్ సిద్ధమైయ్యాడట. ఆల్మోస్ట్ ఒకే అయి పోయింది. రామాయణం, మహాభారతం ఆధారంగా చాలా సినిమాలొచ్చాయ కానీ… కుమారస్వామి నేపథ్యంతో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా కాన్సెప్ట్ ఇదే. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇలా విడిపోయిన ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లు మళ్లీ కలవడానికి అల్లు అర్జున్ కారణమైయ్యాడు.
అయితే ఈ సినిమా ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే…ముందుగా వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలి. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ఓ సినిమా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ (NTR), త్రివిక్రమ్ (Director Trivikram)లు కలిసి పని చేస్తారు.
మరోవైపు ప్రజెంట్ ప్రశాంత్‌నీల్‌తో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆ మూవీ తర్వాత ‘దేవర 2’ ఉంటుంది. ఆ నెక్ట్స్ తమిళ దర్శకుడు నెల్సన్‌తో మూవీ చేస్తాడు ఎన్టీఆర్. ఆపై.. త్రివి క్రమ్ ..మైథలాజికల్ సబ్జెక్ట్ సెట్స్‌పైకి వెళ్లొచ్చు. కానీ ఇందుకు చాలా సమయం ఉన్నట్లుగా తెలు స్తోంది.
అల్లు అర్జున్‌కు త్రివిక్రమ్ ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలిచ్చాడు. మరీ ముఖ్యంగా ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ మూవీ ఫెయిల్యుర్ తర్వాత ఇబ్బందిపడుతున్న అల్లు అర్జున్‌కు ‘అల..వైకుంఠపురములో…’ వంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఇచ్చాడు త్రివిక్రమ్. అలా తన కెరీర్ ఎదుగుదలతో కీలక పాత్ర వహించిన త్రివిక్రమ్‌కు అల్లు అర్జున్ షాక్ ఇవ్వడం మాత్రం మాములు విషయం కాదు.