Odela2 Release: అనుష్కా అవుట్‌..తమన్నా ఇన్‌

Viswa
2 Min Read
Tamanna Odela Release date

Web Stories

తమన్నా ప్రధాన పాత్రలో యాక్ట్‌ చేస్తున్న మూవీ ‘ఓదెల 2’ (Odela2 Release). హెబ్బా పటేల్, వశిష్ట ఎన్‌. సింహా, యువ, నాగమహేశ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేశారు. సంపత్‌నంది ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌అందిస్తుండటంతో పాటుగా, ఓ నిర్మాతగా ఉన్నారు. అశోక్‌ తేజ డైరె క్షన్‌లో డి. మధు ఈ మూవీని నిర్మిస్తు న్నారు. లేటెస్ట్‌గా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు మేకర్స్‌. ఏప్రిల్‌ 17న ‘ఓదెల 2’ సినిమా (Odela2 Release)ను రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు.

ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా..!

2022లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన ‘ఓదెల’ సినిమాకు సీక్వెల్‌గా, ‘ఓదెల 2’ రాబోతుంది. ఓదెల గ్రామంలోని ఓ సమస్యను నాగసాధువు శివశక్తి ద్వారా ఆ ఊరి దేవుడు మల్లన్న స్వామి ఎలా పరిష్క రించాడు? అన్నదే ఈ చిత్రం కథాంశంగా తెలుస్తోంది. ఈ చిత్రంలోని భైవర, నాగసాధువు పాత్రలోతమన్నా యాక్ట్‌ చేశారు.

మంచి డిమాండ్‌!

ఇటీవల విడుదలైన ‘ఓదెల 2’ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ‘ఓదెల 2’పై అంచనాలు పెరిగిపోయాయి. దాదాపు ఇరవై కోట్ల రూపాయల వరకు ఈ సినిమా బడ్జెట్‌ అయ్యిందట. కానీ ఓటీటీ రైట్స్, శాటిలైట్‌ రైట్స్‌…వంటి హక్కుల ద్వారానే ఈ మూవీ బడ్జెట్‌ ఆల్మోస్ట్‌ ఎనభైశాతం రికవరీ అయిపో యిందని ఫిల్మ్‌నగర్‌ ట్రేడ్‌ చెబుతోంది. ఇక ఏప్రిల్‌ 17న ఈ మూవీ రిలీజై, థియేటర్స్‌లో కూడా బాగా పెర్ఫార్మ్‌ చేయగలిగితే, ‘ఓదెల 2’ సినిమాకు లాభాల పంట పండినట్లే!

పోటీ చిత్రాలు

నిజానికి ఏప్రిల్‌ 18న అనుష్కాశెట్టి యాక్ట్‌ చేసిన ‘ఘాటి’ సినిమా రిలీజ్‌ కావాల్సింది. కానీ ఈ మూవీ వాయిదా పడింది. దీంతో ‘ఓదెల 2’ మూవీని రిలీజ్‌కు రెడీ చేశారు. ఇక ఏప్రిల్‌ 18న ప్రియదర్శి లీడ్‌ రోల్‌లో చేసిన ‘సారంగపాణి జాతకం’ అనే ఎంటర్‌టైనర్‌ మూవీ థియేటర్స్‌లోకి రానుంది. ఇంకా ఏప్రిల్‌ 18కి సమ యం ఉంది కాబట్టి…మరెన్ని సినిమాలు ఈ తేదీకి రిలీజ్‌కు రెడీ అవుతాయో చూడాలి.

 

 

Please Share
4 Comments
Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos