Paatal Lok Webseries Seanson2: పాతాళలోకం 2 రివ్యూ

పాతాళలోకం సీజన్‌ 1 వెబ్‌సిరీస్‌కు సూపర్భ్‌ రెస్పాన్స్‌ రావడంతో..పాతాళలోకం 2 వెబ్‌సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి..ఈ అంచనాలను 'పాతాళలోకం 2' అందుకోగలిగిందా?

Viswa
4 Min Read
PAATAL LOK2 Telugu Review

కథ

Paatal Lok Webseries Seanson2: ఢిల్లీలో నాగాలాండ్‌ బిజినెస్‌ సమ్మిట్‌ జరుగుతుంటుంది. కానీ ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన నాగాలాండ్‌ ప్రముఖ రాజకీయ నాయకుడు జోనాథన్‌ థామ్‌ (కగురోయింగ్‌ గొన్మెయి) దారుణంగా హత్య చేయబడతాడు. ఈ కేసును యంగ్‌ ఆఫీసర్‌ ఇమ్రాన్‌ అన్సారీ (ఈశ్వక్‌ త్యాగి)కి అప్ప గిస్తుంది ప్రభుత్వం. మరోవైపు తన భర్త రాజా పాశ్వాన్‌ మిస్‌ అయ్యాడని గీత అనే గృహిణి పోలీస్‌ ఆఫీసర్‌ హథీరామ్‌ చౌదరి (జైదీప్‌ అహ్లావత్‌)కి ఫిర్యాదు చేస్తుంది. జానోథన్‌ థామ్‌ హత్య, రాజా పాశ్వాన్‌ మిస్సింగ్‌…ఈ రెండు కేసుల్లో కామన్‌గా రోస్‌ (మెరెన్లా ఇమ్సాంగ్‌) అనే అమ్మాయికి కనెక్షన్‌ ఉన్నట్లుగా హథీరామ్, ఇమ్రాన్‌లు ఒక నిర్ధారణకు వస్తారు. దీంతో రోస్‌ గురించి తెలుసుకోవడానికి నాగాలాండ్‌ వెళ్తారు హథీరామ్, ఇమ్రాన్‌. అక్కడి లోకల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మేఘన (తిలోత్తమ షోమి) వీరికి హెల్ప్‌ చేస్తుంటుంది. మరి..జోనాథన్‌ థామ్‌ హత్యకు, రాజా పాశ్వాన్‌ మిస్సింగ్‌ కేసులతో రోస్‌కు ఉన్న కనెక్షన్‌ ఏమిటి? అసలు..జోనాథన్‌ థామ్, రాజాల చావులకు కారణమైన నిజమైన హంతకులు ఎవరు? హథీరామ్, ఇమ్రాన్‌లను స్నైపర్‌ డేనియల్‌ (ప్రశాంత్‌ తమాంగ్‌), రూబెన్‌థామ్‌లు ఎందుకు టార్గెట్‌ చేశారు? నాగాలాండ్‌ బిజినెస్‌ సమ్మిట్‌కు వ్యాపారవేత్త కపిల్‌రెడ్డి (నగేష్‌ కుక్కునూర్‌)కి, నాగాలాండ్‌ రాజకీయ నాయకుడు కెన్‌లకు ఉన్న సంబంధం ఏమిటి? గీతకు యాక్సిడెంట్‌ చేసింది ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలను సిరీస్‌లో (Paatal Lok Seanson2 )చూడాల్సిందే.

విశ్లేషణ

(Paatal Lok2 ) జోనాథన్‌ థామ్‌ హత్య కేసుతోనే ‘పాతాళలోకం 2’ సిరీస్‌ కథ మొదలవుతుంది. ఈ కేసు ఇమ్రాన్‌ అన్సారీ చేతికి రావడం, మరోవైపు హథీరామ్‌ల మిస్సింగ్‌ కంప్లైట్‌ రావడం….వీరిద్దరు…వారి వారి ఇన్వెస్టిగేషన్స్‌ను స్టార్ట్‌ చేయడంతో తొలిఎపిసోడ్‌ ముగుస్తుంది. ఈ రెండు హత్యలకు రోస్‌ అనే అమ్మాయి కామన్‌ కనెక్షన్‌ అని తెలియడం, వీరిద్దరు కలిసి పనిచేయాలనుకోవడంతో రెండో ఎపిసోడ్‌ ముగుస్తుంది. ఇంతవరకు కథ మాములుగానే సాగుతుంది. కానీ రోస్‌ కోసం హథీరామ్, అన్సారీలు నాగాలాండ్‌ వెళ్లిన తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. కానీ వెంటనే రోస్‌ బ్యాక్‌డ్రాస్‌ రావడం, ఆమె పాత సన్నివేశాలు కాస్త ఒపిగ్గా చూడాలి. మళ్లీ అన్సారీపై దాడి జరిగిన తర్వాత కథలో వేగం మొదలవుతుంది. అక్క డ్నుంచి మేఘన సాయంతో హథీరామ్‌ ఒక్కడే కేసును ఎలా సాల్వ్‌ చేశాడన్న అంశాలు ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ మేఘన, హథీ రామ్‌ల ఫ్యామిలీ సీన్స్‌ కథ వేగాన్ని తగ్గించినట్లుగా అనిపిస్తుంది. రూబెన్‌ థామ్, డేనియల్, కెన్‌ల పాత్రల దగ్గరకు హథీరామ్‌ చేరుకోవడంతో కథ క్లైమాక్స్‌కు వస్తుంది. కానీ రాజా పాశ్వాన్‌ హత్య కేసును హథీరామ్‌ ఇన్వేస్టిగేషన్‌ చేయడం సిరీస్‌ క్లైమాక్స్‌లో ఉంటుంది (Paatal Lok2 Review in Telugu).

Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

Patal Lok Season2 Review in Telugu

మొత్తం 8 ఎపిసోడ్స్‌ ఉన్నాయి ఈ వెబ్‌సిరీస్‌లో. ఐదారు ఎపిసోడ్స్‌ కాస్త స్లోగా ఉంటాయి. కానీ ఏడు, ఎనిమిది ఎపిసోడ్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు, కథలోని మలుపులు బాగుంటాయి. కానీ రోస్, రూబెన్, ఇమ్రాన్, డేనియల్‌ల పాత్రలు అప్పటివరకు పవర్‌ఫుల్‌గా ఉండి, సడన్‌గా తేలిపోతాయి. మధ్యలో వచ్చే రాహుల్‌. మొదట ఉన్న గీత పాత్రలు కథతో కనెక్షన్‌ లేన్నట్లుగా మాయమవుతాయి. కొన్ని ఎసిపోడ్స్‌ సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో రాజా పాశ్వాన్‌ కుటుంబానికి హథీరామ్‌ డబ్బులు అందజేస్‌ సీన్‌ ఎమోషనల్‌ అనిపించవచ్చు. తొలిసీజన్‌లో ఉన్నట్లు అతి అశ్లీల సన్నివేశాలు లేవు. కానీ కొన్ని సీన్స్‌లో బూతులు ఉన్నాయి. హింస ఉంది.

RifleClub Telugu Review: మలయాళం ఫిల్మ్‌ రైఫిల్‌ క్లబ్‌ రివ్యూ

నటీనటులు

Jaideep Ahlawat Paatal Lok2 Review

హథీరామ్‌ చౌదరిగా జైదీప్‌ అహ్లావత్‌ (Jaideep Ahlawat) సూపర్భ్‌గా చేశాడు. సిరీస్‌ ఆద్యాంతం ఈ పాత్ర కొనసాగుతూనే ఉం టుంది. యాక్షన్‌ సీక్వెన్స్, ఫ్యామిలీ ఎమో షనల్‌ సీన్స్‌లో జైదీప్‌ బాగా చేశారు. మరోసారి జైదీప్‌కు మంచి పేరు వస్తుంది ఈ సిరీస్‌తో. ఈశ్వక్‌త్యాగిగా ఇమ్రాన్‌ అన్సారీ  రోల్‌ సిరీస్‌ మధ్యలోనే కంప్లీట్‌ అవుతుంది. కానీ కథపై మంచి ఇంపాక్ట్‌ ఉన్న రోల్‌ ఇది. జైదీప్‌– ఈశ్వక్‌ల కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ బాగుంటాయి. డ్రగ్‌ ఎడిక్ట్‌ అయిన రోస్‌ పాత్రలో మెరెన్లా ఇమ్సాంగ్‌ నటన ఫర్వాలేదనిపిస్తుంది. ఈ రోల్‌ చూట్టే కథ అంతా తిరుగుతుంది. ఆఫీసర్‌ మేఘనగా తిలోత్తమ షోమి రోల్‌ మెప్పిస్తుంది. కానీ రెండు ఎపిసోడ్స్‌ తర్వాతే ఈ రోల్‌ కనిపిస్తుంది. జైదీప్‌కు సపోర్ట్‌ చేసే పోలీస్‌ ఆఫీసర్‌గా అభిషేక్‌ బెనర్జీ, నాగాలాండ్‌ సీనియర్‌ రాజకీయ నాయకుడు కెన్‌గా జాహ్ను బారువాలు యాక్ట్‌ చేశారు. డాలీ మెహ్రాగా స్వస్తిక్‌ ముఖర్జీ, వ్యాపారవేత్త కపిల్‌రెడ్డిగా నగేష్‌ కుక్కునూర్, సంజీవ్‌ మెహ్రాగా నీరజ్‌ కబి, రూబెన్‌ థామ్‌గా ఎల్‌సీ సెఖోస్, డేనియల్‌గా ప్రశాంత్‌ తమాంగ్‌లు వారి పాత్రల పరిధి మేరకు నటించారు. అవినాష్‌ అరుణ్‌ థావరే డైరెక్షన్‌ బాగుంది. రైటర్స్‌గా సాగర్‌ హవేలి, హర్థిక్‌ మెహతా, గునీత్‌ చోప్పా మెప్పించారు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్‌ సూక్ష్మదర్శని రివ్యూ

బాటమ్‌ లైన్స్‌: ఇన్వేస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడేవారికి ‘పాతాళలోకం సీజన్‌ 2’ చక్కని ఛాయిస్‌. కథ కొన్ని చోట్ల స్లోగా, మరికొన్ని సన్నివేశాలు ఊహాకు తగ్గట్లుగా ఉన్నా…కథలో ఉన్న కొన్ని ట్విస్ట్‌లు, మలుపులు వీక్షకులను అలరిస్తాయి (Paatal Lok Review).

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ‘పాతాళలోకం 2’ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

రేటింగ్‌: 2.75/5

Please Share
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *