Pawan Kalyan: నేనేప్పుడూ మూలాలు మర్చిపోను: పవన్‌కల్యాణ్‌

Viswa
2 Min Read

‘గేమ్‌చేంజర్‌’ (gameChanger) సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌కళ్యాణ్‌ (Pawan Kalyan) మాట్లాడిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. తానెప్పుడూ మూలాలు మర్చిపోనని, తానైనా, రామ్‌చరణ్‌ అయినా…మెగాస్టార్‌ చిరంజీవి వల్లే ఇక్కడ (ఇండస్ట్రీలో) ఉన్నామని పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) చెప్పకొచ్చారు. స్పీచ్‌లో రెండుమూడుసార్లు మూలాలు మర్చిపోననే ప్రస్తావన వచ్చింది.

 

అయితే అల్లు అర్జున్‌ (AlluArjun)ను ఉద్దేశించే, పరోక్షంగా పవన్‌కల్యాణ్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌ (Ramcharan)ను ఆకానాకి ఎత్తేస్తారు పవన్‌కల్యాణ్‌. రామ్‌చరణ్‌ ఎంతో ఒదిగి ఉంటాడని, తన బలం తానకు తెలిసినా కూడా గ్రౌండె డ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తాడని, మెగాస్టార్‌ చిరంజీవికి అసలు సిసలైన వారసుడు రామ్‌చరణ్‌ అని పొగడ్తలతో ముంచేస్తారు పవన్‌కళ్యాణ్‌. ఇంకా….మెగాస్టార్‌ చిరంజీవి కొడుకు, గ్లోబల్‌ స్టార్‌ కాకుండా, ఏమవుతాడని, రామ్‌చరణ్‌ గ్లోబల్‌స్టార్‌ అని పవన్‌కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు.

Pushpa2: పుష్ప ది రూల్‌ దెబ్బకు బాహుబలి రికార్డులు ఫట్‌

గేమ్‌ఛేంజర్‌కు స్పెషల్‌ పర్మిషన్స్‌…!

ఒకవైపు గేమ్‌ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ వేడుక జరుగుతుండగానే, మరోవైపు ‘గేమ్‌ఛేంజర్‌’కు ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్‌ ప్రిమియర్స్, స్పెషల్‌ షోలకు అనుమతులు ఇస్తున్నట్లుగా ప్రభుత్వ జీవో వచ్చింది. జనవరి 10 ఉదయం 1 గంటకు ఆంధ్రప్రదేశ్‌లో ‘గేమ్‌ఛేంజర్‌’ స్పెషల్‌ ప్రీమియర్‌ వేసుకోవచ్చని, ఈ స్పెషల్‌ ప్రిమియర్‌ ధర రూ.600 రూపాయాలుగా నిర్ణయించారు. జనవరి10న ఆరు షోలను ప్రదర్శించవచ్చు. ఉదయం నాలుగు గంటల షోను కూడా ప్రదర్శించుకోవచ్చు. జనవరి 11 నుంచి జనవరి 23 వరకు మల్టీఫ్లెక్స్‌లో రూ. 175, సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.135 పెంపుదలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. జనవరి 11 నుంచి జనవరి 23 వరకు రోజుకు ఐదు షోలను మాత్రమే ప్రదర్శించాలి.

పుష్ప ది రూల్‌ (PushpaTheRule) సినిమాకు కూడా స్పెషల్‌ ప్రీమియర్‌ టికెట్‌ ధరలను పెంచారు. కానీ స్లాబులు ఉన్నాయి. అంటే కొన్ని రోజులకు కొంత రేటు, మరికొన్ని రోజులకు మరికొంత రేటు అన్నట్లుగా అన్నమాట. కానీ గేమ్‌చేంజర్‌ సినిమాకు ఏకథాటిగా జనవరి 11 నుంచి జనవరి 23 వరకు ఒకేరకమైన ప్రత్యేకధరలు ఉన్నాయి.

 

Share This Article
4 Comments