హమ్మయ్య..వీరమల్లు వస్తున్నాడయ్యా..!

Viswa
2 Min Read
Pawankalyan Hariharaveeramallu Release date

పవన్‌కళ్యాన్‌ సినీ కెరీర్‌లో జరగనన్నీ అన్ని ట్విస్ట్‌లు ‘హరిహరవీరమల్లు’ (Pawankalyan Hariharaveeramallu Release) సినిమా విషయంలో జరిగాయి. 2022లో సంక్రాంతికి (Pawankalyan Hariharaveeramallu) రిలీజ్‌ అన్నారు. మూడు సంవత్సరాలు అవుతున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై సరైన స్పష్టత లేదు. ఒక భాగంగా మొదలైన ఈ సినిమా, ఇప్పుడు రెండు భాగా లుగా విడుదల అవుతోంది. తొలుత ఈ సినిమాకు దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ, కానీ ఆ తర్వాత ఈ సినిమా నిర్మాత ఏయం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ కూడా ఈ సినిమా కోసం మరో దర్శకుడు అయ్యాడు. ‘హరిహరవీరమల్లు’ సినిమా ఓటీటీ రైట్స్‌ విషయంలో కొన్ని చిక్కులు. కొంతమంది క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కూడా మారిపోయారు. ఫైనల్‌గా….పవన్‌ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమా జూన్‌ 13న (Pawankalyan Hariharaveeramallu) రిలీజ్‌ కానుంది తెలిసింది. అతి త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వస్తుంది.

17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే ఈ మూవీలో ఓ దొంగ (పెద్దల దగ్గర దోచుకుని, పెదలకు సాయం చేసే రాబిన్‌హుడ్‌ పాత్రలా..)లా పవన్‌కళ్యాణ్‌ కనిపిస్తాడు. ఈ సినిమాలో ఓ జంతు వుతో వచ్చే ఫైట్‌ సీక్వెన్స్, ఓ వాటర్‌ సీక్వెన్స్‌ (హీరో ఇంట్రడక్షన్‌) వంటి సన్నివేశాలు ఆడి యన్స్‌కు సూపర్భ్‌గా అనిపిస్తాయి. పంచమిగా నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా చేస్తోంది. నాజర్, బాబీ డియోల్‌లు ఇతర లీడ్‌ రోల్స్‌లో కనిపిస్తారు. ఏయం. రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్‌ రావు ఈ సినిమాను (Pawankalyan Hariharaveeramallu) నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకుంది.

PawanKalyan Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

గబ్బర్‌ సింగ్‌ తర్వాత హీరో పవన్‌ కళ్యాణ్ (PawanKalyan), దర్శకుడు హరీష్‌శంకర్‌ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (PawanKalyan Ustaad Bhagat Singh) అనే మూవీ రావాలి. ఎప్పుడో అనౌన్స్‌ చేశారు. కానీ పవన్‌కళ్యాణ్‌ రాజకీయ కార్యక్రమాల వల్ల ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లడం లేదు. ఇప్పుడు రాజకీయాల పరంగా పవన్‌ కాస్త రిలాక్స్‌ అయ్యి, ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడంలో నిమిగ్నమైయ్యారు. ఈ క్రమంలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా షూటింగ్‌ను జూన్‌ నుంచి ప్రారంభించాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మైత్రీమూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక తమిళంలో హిట్‌గా నిలిచిన విజయ్‌ ‘తేరీ’ సినిమాకు ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా, తెలుగు రీమేక్‌ అనే టాక్‌ ఉంది.

Pawankalyan OG:సెప్టెంబరులో ఓజీ

సుజిత్‌ డైరెక్షన్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఓజీ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాడు. ఈ సినిమాను ఈ సెప్టెంబరులో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. అనుకున్న సమయానికి కుదరకపోవడంతో, ఆ సెప్టెంబరు 27 తేదీకి ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌ కొట్టింది. మరి..ఈ సెప్టెంబరులోనైనా పవన్‌ కళ్యాణ్‌ ఓజీ రిలీజ్‌ అవుతుందా? లేదా? అనేది చూడాలి.

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *