పవన్‌కల్యాణ్ (Pawankalyan) ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదరుచూస్తున్న ‘హరిహరవీరమల్లు’ (Pawankalyan HariHaraVeeraMallu) సినిమా తొలిసార్టు ‘హరిహరవీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ (HariharaVeeraMallu Part 1: Sword vs Spirit ~ Battle for Dharma) సినిమా ట్రైలర్ విడుదలైంది. 17వ శతాబ్దం నేపథ్యంతో సాగే ఈ హిస్టారికల్ డ్రామా (Pawankalyan HariHaraVeeraMallu) సినిమా ట్రైలర్ విజువల్స్, ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్‌లోని డైలాగ్స్ పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉన్నాయి.
హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం…ఒక వీరుడు కోసం ప్రక్రుతి పురుడు పోసుకుంటున్న సమయం
గోల్కొండ నుంచి ఎనిమిదోవాడు బయలుదేరాడు..వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు…
ఇది నేను రాసే చరిత్ర..సింహాసనమా? మరణశాసనమా?
ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్…దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి…
ఎవరది..ఎవరది..అతగాడోక పొడుకు కథ…
ఇప్పటిదాకా మేకల్ని తీనే పులులను చూసుంటారు…ఇప్పుడు పులుల్ని వేటాడే బొబ్బిలిని చూస్తారు
సూర్యుడికే కన్ను కప్పి సంచరించే యోధుడు…చంద్రుడినే సంచికెత్తి తస్కరించే వీరుడు

సర్దుకోలేకపోతున్నాను..సాయం చేస్తావా..
దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట….
నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు…కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు….
వినాలి..వీరమల్లు చెప్పింది వినాలి
హిందూ దేశంమీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి.
ప్రక్రుతికి మరో ధర్మం ఉంది ఔరంగజేబ్….ఇది క్రూరమ్రుగాలు తిరిగే చోటు..
అన్న డైలాగ్‌లు హరిహరవీరమల్లు సినిమా (Pawankalyan HariHaraVeeraMallu Trailer) ట్రైలర్‌లో ఉన్నాయి.
హరిహరవీరమల్లు సినిమాకు తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నాడు. దీంతో ఇన్ని రోజులు ఈ హరిహరవీరమల్లు సినిమాకు ఇప్పటివరకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతిక్రిష్ణ (HariHaraVeeraMallu Director Jyothi Krisna)లు దర్శకులుగా చెప్పుకొచ్చారు. కానీ ట్రైలర్‌లో జ్యోతిక్రిష్ణ ఒక్కపేరు కనిపించింది. ఇక నాలుగు సంవత్సరాల క్రితం ‘హరిహరవీరమల్లు’ సినిమాను స్టార్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూనే వస్తోంది. ఫైనల్‌గా ఈ జూలై 24న ఈ సినిమా విడుదల కాబోతుంది.
హరహరవీరమల్లు టైటిల్ రోల్‌లో పవన్‌కల్యాణ్, పంచమి పాత్రలో నిధీ అగర్వాల్, ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్‌లు నటించారు. బాబీ డియోల్ అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహిలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎమ్‌ఎమ్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఏఏం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మంచిన చిత్రం ఇది.