OG Cinema Review: పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన లెటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ (ఓజాస్ గంభీర) (OG) మరికొన్ని గంటల్లో ప్రీమియర్ కానుంది. తెలంగాణలో సెప్టెంబరు 24 రాత్రి 9 గంటలకు ‘ఓజీ’ సినిమా ప్రీమియర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి 10 గంటల నుంచి ఓజీ ప్రీమియర్ షో (OG Premier Show) మొదలువు తుంది. సెప్టెంబరు 25 (OG Movie Release date) న ప్రపంచవ్యాప్తంగా ‘ఓజీ’ సినిమా థియే టర్స్‌లో రిలీజ్ కానుంది. ఆల్రె డీ సినిమా టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయగా, హాట్‌కేక్‌లా అమ్ముడు పోతున్నాయి. మరి..ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఓ సారి చూద్దాం.
గ్యాంగ్‌స్టర్ డ్రామా
1980–1990 నేపథ్యంతో బాంబే (ముంబై) నేపథ్యంతో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. ఈ చిత్రంలో ఓజాస్ గంభీరగా పవన్‌కల్యాన్ టైటిల్ రోల్ చేశారు. సత్యదాదా గ్యాంగ్‌లో క్రియా శీలకంగా వ్యవహరించే ఓజాస్ గంభీర కొన్ని కారణాల వల్ల మాఫియా వదిలి, అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. దీంతో సత్యదాదా గ్యాంగ్‌కు అపోజిట్‌లో ఉన్న గ్యాంగ్, సత్య దాదాను టార్గెట్ చేస్తుంది. కానీ ఓజీ పట్టించుకోడట. అయితే ఎప్పుడైతే, తన ఫ్యామిలీ జోలికి శత్రువులు వస్తారో, అప్పడు ఓజీ అజ్ఞాతం వీడి, మళ్లీ బాంబే వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో కుమార్తె సెంటిమెంట్ బలంగా ఉంటుందని తెలిసింది. తొలిభాగం డ్రామాతో నడిచిన, సెకండాఫ్ మాత్రం ఇంటెన్స్ అండ్ హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఓజీ సినిమా ఉంటుందని తెలిసింది.
Read More :బాంబే వస్తున్నా…తలలు జాగ్రత్త…ఓజీ మాస్ వార్నింగ్
Pawankalyan OG Cast And Crew: ఎవరెవరు ఏ ఏ పాత్రలు చేశారు!
ఓజీగా పవన్‌కల్యాణ్ టైటిల్ రోల్ చేశాడు. ఓజీ ప్రేయసి, భార్య కణ్మని పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. విలన్ ఓజీగా ఇమ్రాన్ హాష్మి నటించాడు. అర్జున్ పాత్రలో అర్జున్ దాస్, సత్యనారాయాణ ఆలియాస్ సత్యదాదాగా ప్రకాష్‌రాజ్, గీతగా శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, శుభలేక సుధా కర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దాన య్య, దాసరి కల్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబరు 25న ఓజీ సినిమా విడుదల అవుతోంది. ఓజీ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. నవీన్‌నూలి ఎడిటింగ్ వర్క్ చేయగా, రవి. కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా చేశాడు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.
ఏ సర్టిఫికేట్
‘ఓజీ’ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. యాక్షన్ మోతాదు మితీమిరిన సన్నివేశాలు ఉన్నందు వల్లే ఓజీ సినిమాకు సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చిందనే ప్రచారం సాగుతోంది. కొన్ని అశ్లీల సన్నివేశాలు కూడా ఉన్నాయా? అనేది థియే టర్స్‌లో చూడాలి. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రెండు నిమిషాల మితిమీరిన యాక్షన్ సన్నివేశాల ను తొలగించారు. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉంటుంది. బస్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ ఏరా సీన్స్, అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సిని మాలో హైలైట్‌గా ఉంటాయట. ప్రియాంక పాత్ర నిడివి తక్కువే. కానీ శ్రియా రెడ్డికి మంచి ఎలివేషన్ ఉన్న సీన్స్ పడ్డాయట సినిమాలో.
పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలోని కొన్ని ఫోటోలు, స్టిల్స్..ఓ లుక్ వేయండి
హాయ్యెస్ట్ కలెక్షన్స్
ఓజీ ప్రిమియర్ లేదా బెనిఫిట్ షోల ఒక్కో సినిమా టికెట్ ధర. రూ. 1000గా ప్రభుత్వం నిర్ణ యించింది. పైగా బుకింగ్స్ బాగున్నాయి. దీంతో పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు, రికార్డులు సాధించే దిశగా ఓజీ సినిమా ముందుకు వెళ్తుంది.