Poonam Kaur: హీరోయిన్ పూనమ్‌కౌర్ (Poonam Kaur) తనకు న్యాయం కావాలంటూ మరో సారి ట్వీట్ చేయడం టాలీవుడ్ ఇండస్ట్రీ లో చర్చనీయాంశమైంది. దర్శకుడు త్రివిక్రమ్ వల్ల ఇండస్ట్రీలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నాని ఎప్పట్నుంచో పూనమ్ కౌర్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పూనమ్ కౌర్ మరోసారి స్పందించారు.
Vishal: విశాల్‌కు ఏమైంది..? మైక్ కూడా పట్టుకోలేకపోతున్నాడు?
‘‘దర్శకుడు త్రివిక్రమ్‌పై చాలా క్రితం ఫిర్యాదు చేశాను. కానీ ‘మా’ (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్– తెలుగు సినిమా నటీనటుల సంఘం) నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆయన నా జీవితాన్ని, నా సంతోషాన్ని నాశ నం చేశారు. ‘మా’కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. ఆయన్ను ప్రశ్నించడం అటు ఉంచితే, కనీసం యాక్షన్ కూడా తీసుకోవడం లేదు. చాలా పెద్ద వ్యక్తులు ఆయనకు అండగా ఉన్నట్లున్నారు’’ అని పూనమ్ కౌర్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
No questioning or even action taken on director #Trivikramsrinivas for complaint give in maa association for very long , he rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025
అయితే పూనమ్ కౌర్‌కు పరోక్షంగా ప్రస్తుత ‘మా’ అసోసియేషన్ ప్రతినిధి శివబాలాజీ స్పందించారు. ‘‘మేం బాధ్యతలు తీసుకున్నప్పట్నుంచి, ఆమె నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు’’ అంటూ మాట్లాడారు.
No proceeds after this – thank you 🙏 pic.twitter.com/cW8TiWax0Q
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025
దీంతో పూనమ్‌కౌర్ ‘ఎక్స్’ వేదికగా మళ్లీ ట్వీట్ చేశారు. ‘‘త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మీరు చేసిన ఫిర్యాదు మా దృష్టికి వచ్చింది. మీ అభ్యర్థన మేరకు తెలుగు ఫిల్మ్ చాంబర్ లో మిమ్మల్నీ కలిసి, మాట్లాడటం జరుగుతుంది. ఈ విషయానికి చెందిన ప్యానెల్‌లో, ఇద్దరు మహిళు కూడా ఉంటారు’’ అని తనకు మెయిల్ వచ్చినట్లుగా పూనమ్ ట్వీట్ చేశారు. అలాగే ‘మా’ నుంచి తనకు రెండు నెలల క్రితం మెయిన్ వచ్చినట్లుగా కూడా పూనమ్ కౌర్ పేర్కొన్నారు.
This reply was couple of months back after which no follow up was done .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025
దీంతో ఈ అంశంపై ‘మా’ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుటుంది? అనే అంశం తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.