Prabhas and Nayanthara: ప్రభాస్ ‘యోగి’ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమా తర్వాత ప్రభాస్, నయనతార స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మళ్లీ ఇప్పుడు రాజాసాబ్ (The Raja Saab) సినిమా కోసం ప్రభాస్, నయనతార స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ‘రాజాసాబ్’లోని ఓ స్పెషల్‌సాంగ్ కోసం ప్రభాస్, నయనతారస్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లుగా తెలిసింది. ఇద్దరు సూపర్‌స్టార్ కాంబినేషన్‌లో ఓ స్పెషల్ సాంగ్ అంటే ఆడియన్స్ సూపర్‌ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. అయితే చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నా కూడాప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా కోసం నయనతార గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం విశేషం (Prabhas and Nayanthara)
AkhilAkkineni: అఖిల్ చేయాల్సిన వందకోట్ల సినిమా క్యాన్సిల్?
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ యాక్షన్ ఫిల్మ్‌లో మాళవికా మోహనన్, నిదీఅగర్వాల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ‘రాజాసాబ్’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, భారీగా గ్రాఫిక్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల రాజాసాబ్ సినిమా రిలీజ్ వాయిదా పడొచ్చు అనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
AnushkaShetty Ghaati: ఘాటి రిలీజ్ ఎప్పుడంటే..!.
‘రాజా డీలక్స్’ అనే ఓ థియేటర్ నేపథ్యంతో జరిగే హారర్ కామెడీగా రాజాసాబ్ సినిమా రానుందని తెలిసింది. సంజయ్‌దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారు. తాతమనమళ్ళుగా కనిపిస్తారని తెలిసింది.