TheRajasaab Trailer: రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas)తో దర్శకుడు మారుతి (Director Maruti) సినిమా అనగానే, అందరు ఆశ్చర్యపోయారు. ప్రభాస్ ఫ్యాన్స్ కొందరైతే… మారుతితో సినిమా వద్దే వద్దు అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అదే సమయంలో గోపీచంద్ హీరోగా మారుతి డైరెక్షన్‌లోని ‘పక్కా కమర్షియల్’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చి, పరాజయం పాలైంది. దీంతో ప్రభాస్–మారుతి (Prabhas Maruti TheRajasaab) సినిమా ఇక ఉండదని అందరు అనుకున్నారు. మారుతి కూడా ‘ది రాజాసాబ్’ లాంటి సినిమా వద్దని ప్రభాస్‌కు చెప్పారు. సినిమా దర్శకుడే సినిమా వద్దని చెప్పిన తర్వాత కూడా ప్రభాస్ ఊరు కోలేదు. మారుతిని ప్రోత్సహించాడు. ‘ది రాజాసాబ్’ సినిమాని కంటిన్యూ చేయమని చెప్పాడు.
‘ది రాజాసాబ్’ సినిమా టీజర్ విడుదలైనప్పుడు, మారుతి ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని ఆడియన్స్ నమ్మారు. సెప్టెంబరు 28న ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ‘ది రాజాసాబ్’ సినిమాలో ఆడియన్స్‌కు నచ్చే మ్యాజిక్ ఉందని తెలిసింది. ప్రభాస్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ అంచ నాలను అందుకునే విధంగానే ‘ది రాజాసాబ్’ సినిమా ట్రైలర్ ఉంది. విజువల్, వింటేజ్ ప్రభాస్ లుక్స్, ప్రభాస్ కామెడీ టైమింగ్, హారర్ స్టోరీ బ్యాక్‌డ్రాప్, నెగటివ్ షేడ్స్‌లో ప్రభాస్… ఇలా ప్రతి అంశంలోనూ ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను అందుకున్నాడు మారుతి. సినిమాపై మరింత హైప్ పెరిగిలే చేశాడు. ప్రభాస్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకున్నాడు.
ప్రభాస్ హీరోగా నటించిన ఫ్యాంటసీ హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’. టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్‌లు నిర్మించిన ఈ సినిమా జనవరి 9న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. మారుతి దర్శకుడు. మాళవికా మోహనన్, రిద్దికుమార్, నిధీ అగర్వాల్‌లు హీరోయిన్స్‌గా నటించగా, వీటీవీ గణేష్, సప్తగిరి, బొమన్ ఇరానీ, సంజయ్‌దత్, జరీనా వాహబ్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రాజాసాబ్’ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక సెప్టెంబరు 28న విడుదలైన ‘ది రాజాసాబ్’ సినిమా ట్రైలర్ ఫైనల్ ట్రైలర్ కాదు. ఈ సినిమా ఈ సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కనక…ఆ సమయంలో ‘ది రాజాసాబ్’ సినిమా రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారు.

అలాగే అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ది రాజాసాబ్’ సినిమాలోని తొలి పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇంకా ‘ది రాజాసాబ్’ సినిమా రెండు పార్టులు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.