Pradeep Ranganathan Dude Review: ‘లవ్‌టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించు కున్నాడు తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్. తాజాగా ప్రదీప్ రంగనాథన్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘డ్యూడ్’. ప్రదీప్ గత చిత్రాలు ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలు తెలుగులోనూ హిట్స్‌గా నిలిచిన నేపథ్యంలో, ‘డ్యూడ్’పై అంచనాలు ఏర్ప డ్డాయి. పైగా ‘డ్యూడ్’ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్‌ను ఏట్రాక్ట్ చేసింది. మరి…ఫైనల్‌గా ‘డ్యూడ్’ సినిమా, ఆడియన్స్‌ను మెప్పించిందా? రివ్యూలో చదవండి.
సినిమా: డ్యూడ్ (Pradeep Ranganathan Dude Review)
ప్రధాన తారాగణం: ప్రదీప్‌రంగనాథన్, మమితాబైజు, హ్రిదు హరూన్, ఆర్. శరత్‌కుమార్, రోహిణీ, ద్రవిడ సెల్వం
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్
దర్శకుడు: కీర్తీశ్వరన్
సంగీతం:సాయి అభ్వంకర్
ఎడిటింగ్: భరత్ విక్రమన్
సినిమాటోగ్రాఫర్:నికేత్ బొమ్మి
నిడివి: 2 గంటల 19 నిమిషాలు
విడుదల తేదీ:17– 10– 2025
రేటింగ్: 2.25/5
కథ
సర్‌ప్రైజ్ ఈవెంట్స్ చేస్తూ, లైఫ్‌ను హ్యాపీగా గడిపే కుర్రాడు గగన్. ఓ రోజు గగన్ మామయ్య ఆదిశేషులు (ఆర్.శరత్‌కుమార్) కుమార్తె కుముద ట్రైన్‌లో సర్‌ప్రైజ్‌గా లవ్ ప్రొపోజ్ చేస్తుంది. కానీ కుమద ప్రేమను రిజెక్ట్ చేస్తాడు గగన్. దీంతో కుముద ఆ లవ్‌బ్రేకప్ బాధతో, బెంగళూరు వెళ్తుంది. అయితే కుముద వెళ్లిపోయిన తర్వాత, కుముదను తాను ప్రేమిస్తున్నట్లుగా గగన్ తనతంట తాను తెలుసుకుని, తన మామయ్య ఆదిశేషులకు చెబుతాడు. దీంతో ఆదిశేషులు పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. కానీ బెంగళూరు నుంచి తిరిగొచ్చి, గగన్‌కు పెద్ద షాక్ ఇస్తుంది కుముద. తాను బెంగళూరులో పార్థు (హ్రిదూ హరూన్)ను ఇష్టపడ్డానని చెబుతుంది. ఇదే విషయం తన తండ్రి ఆదిశేషులు చెబితే, పార్ధుది తమ కులం కాదని, పార్ధుతో పెళ్లి వద్దని, గనన్‌ను వివాహం చేసుకోమని చెబుతాడు. కానీ కుముదకు గగన్‌తో పెళ్లి ఇష్టం లేదు. ఇదేసమయంలో కుముదను పెళ్లి చేసుకుని, తర్వాత తనకు అప్పజెప్పమని గగన్‌ను పార్థు రిక్వెస్ట్ చేస్తాడు.కుముదపై ప్రేమ తో గగన్ కూడా కాదనలేకపోతాడు. అలా కుముదను గగన్ పెళ్లి చేసుకుంటాడు. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? కుముద–పార్థులను ఫారిన్ పంపాలన్న గగన్ ప్లాన్ ఏమైంది? అసలు నిజం ఆదిశేషులకు తెలిసిందా? కుముదను పార్థకు ఇచ్చేస్తే, మరి..గగన్ పరిస్థితి ఏమిటి? అన్న అంశాలను థియేటర్స్‌లో చూడాలి.
విశ్లేషణ
కులాంతర వివాహం, పరువు హాత్యల అంశాలను నేటి తరం యువతీయువకులకు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంతో చెప్పేందుకు దర్శకుడు కీర్తీశ్వరన్ చేసిన ప్రయత్నమే ఈ ‘డ్యూడ్’ సిని మా. ఇందుకు లవ్ బ్రేకప్, పెళ్లి కాన్సెప్ట్‌లను దర్శకుడు పునాదిగా వాడుకున్నాడు.
‘శ్రీకాంత్–ఉపేంద్రల ‘కన్యాశుల్కం’, అల్లు అర్జున్–నవదీప్‌ల ‘ఆర్య 2’, అల్లు శిరీష్ ‘పరువు’ వంటి సినిమాలు ఈ కోవకు చెందినదే ‘డ్యూడ్’. కాకపోతే నేటి ట్రెండ్ స్టైల్‌కు, కాస్త కామెడీని జోడించారు. కుముద, గగన్‌ల బ్రేకప్, పార్ధు రాక, ఆ తర్వాత కుముద–గగన్‌ల పెళ్లి సన్నివే శాలతో తొలిభాగం ముగుస్తుంది. కుముద–గగన్‌లను ఫారిన్ వెళ్లే ప్రయత్నాలు, ఆదిశేషులకు నిజం తెలియడం వంటి సన్నివేశాలతో సెకండాఫ్ ముగుస్తుంది. తొలిభాగం ఫన్నీగా, ట్రెండీగా, సరదాగా సాగుతుంది. కానీ సెకండాఫ్ మాత్రం ఫ్లో తప్పింది. హీరో క్యారెక్టర్ త్యాగం చేస్తున్న సన్నివేశాలను హైలైట్ చేయడానికి రిపీట్ సీన్స్ పడ్డాయి. హీరో క్యారెక్టర్‌కు సింపతీ కార్డు వాడే ప్రయత్నం చేశారు. హీరో క్యారెక్టర్ ఆర్క్ కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తుంది. పైగా ఓ మంత్రి తాను చేసిన నేరాన్ని 30 సంవత్సరాల తర్వాత తనంతట తానే ఒప్పుకుని, జైలుకు వెళ్లడం అనేది కన్విన్సింగ్‌గా లేదు. సెకండాఫ్‌లో సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. ఆముద ట్రాక్ ఈ సినిమాకు స్పీడ్‌బ్రేకర్‌లా ఉంటుంది. గగన్–కుముదల వివాహం జరిగినా తర్వాత కూడ, ప్రతి సీన్‌లో పార్థు కనిపిస్తూనే ఉంటాడు. కానీ పార్థు పాత్రపై ఎవరికీ ఏ అనుమానం ఎందుకు రాదో తెలియదు. కీర్తీశ్వరన్‌కు దర్శకుడిగా ఇది తొలి సినిమా. అనుభవలేమి కనిపిస్తుంది. ఇందులోని ఊహాత్మక సన్నివేశాలే ఇందుకు నిదర్శనం.
నటీనటులు- సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్
భార్యకు, భార్య ప్రియుడుకు మధ్య నలిగిపోయే గగన్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ మంచి యాక్టింగ్ కనబరిచాడు. ఫ్రాంక్ సీన్స్, కుముదతో ఉన్న ఎమోషనల్ సీన్స్, సోలో ఎమోషనల్ సీన్స్ బాగు న్నాయి. కానీ స్క్రీన్‌పై కొత్త ప్రదీప్ అయితే కనిపించలేదు. కుముద పాత్రలో మమి తాబైజు ఫర్వాలేదనిపించింది. బ్రేకప్ సీన్స్, గగన్ లైఫ్‌ను గాడిలో పెట్టాలని కుముద చేసే ప్రయ త్నాలు వంటి సీన్స్‌లో మమిత యాక్టింగ్ ఒకే. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం ఆర్. శరత్ కుమార్ యాక్టింగ్. ప్రీ ఇంట్రవెల్ ముందు వచ్చే ఫ్రాంక్ సీన్, సెకాండఫ్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న సీన్స్‌లో యాక్టర్‌గా ఆర్. శరత్‌కుమార్ తన అనుభవాన్ని చూపించాడు. పార్ధుగా హ్రిదు హరూన్ ఒకే. హీరో తల్లి పాత్రలో రోహిణీ నటించారు. కానీ ఈ రోల్‌కు సరైన ఇంపాక్ట్ లేదు. సత్య, నేహాశెట్టిలు గెస్ట్ రోల్స్ చేశారు.ద్రవిడ్ సెల్వం,ఐశ్వర్య తదితరలు వారి పాత్రల మేరకు చేశారు. సాయి అభ్యంకర్ ఆర్‌ఆర్ బాగుంది. సాంగ్స్ ఒకే. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా: పరువు హత్యలు, ఫీలింగ్స్, బ్రేకప్‌ల గురించి నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా డ్యూడ్ సందే శం ఇవ్వాలనుకున్నాడు. కానీ ‘డ్యూడ్’ సినిమా లైఫ్ సందేహమైంది.