PradeepRanganathan ReturnoftheDragon: రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్) ఇంటర్‌లో గోల్డ్‌మెడల్ స్టూడెంట్. కానీ తాను ప్రేమించిన అమ్మాయికి డీసెంట్‌గా చదువుకునే అబ్బాయిలకన్నా… పోకిరిగా తిరిగే వాళ్లే ఇష్టమని తెలిసి మనోవేదనకు గురవుతాడు. దీంతో డ్రాగన్‌గా పేరు మార్పుకుని, ఇంజనీరింగ్ కాలేజ్‌లో పోకిరిగా ఉంటాడు. కీర్తీ(అనుపమా పరమేశ్వరన్)ను ప్రేమిస్తాడు. 48 బ్యాక్‌లాక్ పెట్టుకుని, పెద్ద జులాయిగా తిరుతుంటాడు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఏదో జాబ్ చేస్తున్నానని చెప్పి కన్న తల్లిదండ్రులను మోసం చేస్తుంటాడు. ఇదే çసమయంలో లైఫ్‌లోని సెటిల్ కానీ రాఘవన్‌తో బ్రేకప్ చేసుకుంటుంది కీర్తీ. దీంతో లైఫ్‌లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ఫేక్ స్టడీ సర్టిఫికేట్స్‌ను సృష్టించుకుని పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధిస్తాడు రాఘవన్. ఈ క్రమంలో ఓ పెద్దింటి అమ్మాయి పల్లవి (కయాదు లోహర్) తన జీవితంలోకి వస్తుంది. అంతా సవ్వంగా సాగిపోతుందనుకున్న సమయంలో రాఘవన్ చదుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ (మిస్కిన్) వచ్చి, రాఘవన్‌ను బెదిరించి ఓ పనిమని చేయమని చెప్తాడు. మరి..అప్పుడు రాఘవన్ పరిస్థితి ఏమిటి? ఫేక్ సర్టిఫికేట్స్‌తో తెచ్చుకున్న ఉద్యోగం ఏమైంది? రాఘవన్ లైఫ్‌లోకి కీర్తీ తిరిగొచ్చిందా? పల్లవితో రాఘవన్ రిలేషన్ ఏమవుతుంది? తన తల్లి దండ్రులకు రాఘవన్ గురించి నిజం తెలిసినప్పుడు అతని పరిస్థితి ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.(ReturnoftheDragon Review)
యూత్ పల్స్‌ను బాగా పట్టినట్లున్నాడు ప్రదీప్‌రంగనాథన్. తాను హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘లవ్‌టుడే’ మూవీ తెలుగులోనూ విడుదలై, ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలో సోషల్‌మీడియా యాప్స్‌లను దుర్వినియోగం చేయడం, లవ్‌లో నమ్మకం, ఫోటోమార్ఫింగ్.. వంటి సీరియన్ అంశాలనువినోదాత్మకంగా చూపించి, మంచి హిట్ అందుకున్నాడు.
ఇప్పుడు అదే పని చేశాడు. నకిలీ సర్టిఫికేట్స్, సరైన సమయంలో చదువుకోవడం, స్టూడెంట్స్ వాళ్ల జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు? అన్న పాయింట్స్‌ను కాస్త సీరియస్‌గా సందేశాత్మకంగా చెబుతూనే, వినోదాన్ని జోడించి, ఎమోషన్స్‌తో మిక్స్ చేశాడు. మిక్స్‌కు కథలో మలుపులు యాడ్ కావడం కథను మరింత ఇంట్రెస్టింగ్, ఏంగేజింగ్‌గా మార్చింది. క్యాంటీన్‌ఫైట్, ఎయిర్‌ఫోర్ట్ సీన్స్, చోటాడ్రాగెన్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్ సందేశం…సీన్స్ హైలైట్స్‌గా ఉంటాయి. ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల నిజమైన ప్రతిభావంతుల జీవితాలు ఏం అవుతున్నాయన్న పాయింట్‌నూ చర్చించడం బాగుంది. తొలిభాగంలో సాగదీత సన్నివేశాలు, రోటీన్‌గా తొలి 20 నిమిషాల సీన్స్ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే ఇంజ నీరింగ్‌లో పెద్ద చదువుకోని ఓ స్టూడెంట్, ఉద్యోగం సంపాదించిన తర్వాత అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తాడనేది కాస్త రియాలిటీకి దూరంగా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీని గుర్తుతెస్తుంది.
మంచి స్టూడెంట్‌గా, పోకిరిగా, మంచి ఉద్యోగిగా ప్రదీప్‌యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ అనే చెప్పొచ్చు. ప్రదీప్ ఎనర్జీ ఆడియన్స్ చేత కొన్ని సీన్స్‌లో విజిల్స్ వేయిస్తుంది. నిడివి తక్కువగానే ఉన్నా…ఉన్నంతలో కీర్తీగా అనుపమా పరమేశ్వరన్ రోల్ బాగుంటుంది. కథలో ఇంపార్టెన్స్ ఉంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ అనుపమ తన మార్క్ యాక్టింగ్‌ను చూపించారు. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌లా పల్లవి స్క్రీన్‌పై కనిపించారు.
కానీ ప్రిన్సిపాల్‌గా మిస్కిన్‌కు స్ట్రాంగ్ రోల్ దక్కింది. మంచి నటన కనబరచారు. కంపెనీ ఎండీగా గౌతమ్ వాసుదేవ్‌మీనన్, హీరో తండ్రిగా జార్జ్ మరియన్ కనిపించారు. జార్జ్ ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి. స్నేహా, ఇవానా (లవ్‌టుడే ఫేమ్), దర్శకుడు అశ్వత్‌లు కామియో రోల్స్ చేశారు. కేఎస్ రవికుమార్, లక్ష్మణ్, హర్షత్ …ఇలా ఎవరి పాత్రలు వారు చేశారు. యూత్‌ను తన డైరెక్షన్‌తో కనెక్ట్ చేయడంలో దర్శకుడు అశ్వత్ మారిముత్తు మరోసారి సక్సెస్ అయ్యాడు. లియోన్ జేమ్స్ ఆర్‌ఆర్ ఈ సినిమాకు కచ్చితంగా ఫ్లస్ అయ్యింది. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మాణవిలువలు బాగున్నాయి. నిఖేత్ బొమ్మిరెడ్డి విజువల్స్ ఒకే. ప్రదీప్ ఈ రాఘవ్ మరికాస్త ఎడిట్ చేసి ఉండొచ్చు. ముఖ్యంగా తొలిభాగంలో.
బాటమ్‌లైన్: డ్రాగన్..సందేశాత్మక వినోదం!
రేటింగ్: 2.75/5