Prasanth Varma Brahmarakshasa: ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ వెంటనే ‘జై హను మాన్’ సినిమాను స్టార్ట్ చేశాడు. రిషబ్‌శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మించాల్సింది. కానీ ‘కాంతార చాఫ్టర్1’తో రిషబ్‌శెట్టి బిజీగా ఉన్నాడు. దీంతో ‘బ్రహ్మారాక్షస’ ( Brahmarakshasa) అనే సినిమాను స్టార్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ. రణ్‌వీర్ సింగ్‌తో చేయాల్సిన ఈ సినిమా లాస్ట్ మినిట్‌లో ఆగిపోయింది. కానీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం ప్రశాంత్ వర్మ రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే టాక్ వినిపించింది. సినిమా క్యాన్సిల్ అయితే ఈ పది కోట్ల రూపాయాలు గోడ కు కొట్టిన సున్నమే.
దాదాపు పది కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టిన తర్వాత, మైత్రీవాళ్లు బ్రహ్మారాక్షస సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లాల్సిందే అన్నట్లుగా పట్టుబట్టారట. దీంతో ప్రభాస్‌ను అప్రోచ్ అయ్యారు ప్రశాంత్‌వర్మ (Prasanth Varma). ఓ దశలో ఈ సినిమాను గురించి, అధికారిక ప్రకటన రావాల్సింది. కానీ లాస్ట్ మినిట్‌లో వద్దనుకున్నారు. అప్పటికే ‘ది రాజాసాబ్, ఫౌజి’ సినిమాలకు కమిటైన ప్రభాస్, ఆ సినిమాలతో ఇప్పటివరకు బిజీగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వస్తున్నాయి. దీంతో ‘బ్రహ్మారాక్షస’ సినిమాను గురించి ప్రభాస్‌తో మళ్లీ మాట్లాడారు ప్రశాంత్‌వర్మ. ఈ లోపు ‘బ్రహ్మారాక్షస’ (Brahmarakshasa) సినిమాకు సంబంధించిన మేజర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేశాడు ప్రశాంత్ వర్మ. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా పూర్తయింది కనుక, ఇక సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లడమే ఆలస్యం. కానీ ప్రభాస్ కాల్షీట్స్ కావాల్సి ఉంది.
ఎందుకంటే ప్రభాస్ ఆల్రెడీ హోంబలే ఫిలింస్‌కు మూడు సినిమాలు కమిటైయ్యాడు. మరి..‘ది రాజాసాబ్, ఫౌజి’ చిత్రాల తర్వాత ప్రభాస్ కొత్త మూవీ ప్రశాంత్‌వర్మతోనే స్టార్ట్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. కాస్త అటు ఇటు అయినా…ఈ సినిమా మాత్రం సెట్స్‌కు వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇలా రణ్‌బీర్‌సింగ్‌తో చేయా ల్సిన సినిమా కోసం ప్రశాంత్ వర్మ ఖర్చుపెట్టిన రూ. 10 కోట్లు సేఫే. ఎందుకంటే..ఈ సినిమాను చేసేందుకు ప్ర భాస్ సిద్ధమైయ్యాడు కనుక.
దర్శకుడు పా.రంజిత్‌తో శాండీ మాస్టర్ (కిష్కింధపురి, లోక చిత్రాల విలన్) హీరోగా సినిమా