కొరియోగ్రాఫర్‌కు ప్రభాస్‌ డైరెక్షన్‌ చాన్స్‌?

Viswa

Web Stories

Premrakshit: ‘నాటు నాటు’ సాంగ్‌తో కొరియోగ్రాఫర్‌గా ఫేమస్‌ అయ్యారు ప్రేమ్‌రక్షిత్‌ (Premrakshit). ఈ టెక్నిషియన్‌ ఎప్పట్నుంచో దర్శకుడిగా ఇండస్ట్రీలో కొత్త ప్రయాణం మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల హీరో ప్రభాస్‌కు ప్రేమ్‌ రక్షిత్‌ ఓ కథ చెప్పారట. ఈ కథ నచ్చడంతో, ఈ సినిమా చేసేందుకు ప్రభాస్‌ (Prabhas)  ఆల్మోస్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలిసింది.

ప్రేమ్‌ రక్షిత్‌తో ప్రభాస్‌ మూవీ కన్ఫార్మ్‌ అయిపోయింది. కానీ ఈ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటిస్తారా? లేక ప్రొడ్యూస్‌ చేస్తారా? అనే విషయంపై ఇంకా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తు తం ప్రభాస్‌ ‘ఫౌజి’, ‘ది రాజాసాబ్‌’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నాడు. ఆ నెక్ట్స్‌ వెంట నే సందీప్‌రెడ్డివంగాతో ‘స్పిరిట్‌’ సినిమా చేయాల్సి ఉంది. నాగ్‌ అశ్విన్‌తో ‘కల్కి2’ ఎలాగో ఉంది. హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్‌ ఆల్రెడీ మూడు కొత్త సినిమాలు కమిటైయ్యాడు. ఈ తరుణంలో ప్రేమ్‌ రక్షిత్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ సినిమా అనేది కష్టమనే చెప్పాలి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos