ప్రేమంటే…! ..వినోదాల థ్రిల్‌ ప్రాప్తించిందా?

Viswa
Priyadarshi Anandhi Suma Kanakala Premante Movie Review in Telugu

Web Stories

Premante Movie Review: కథ

మధుసూధనరావు (ప్రియదర్శి), రమ్య (ఆనంది) వివాహం చేసుకుంటారు. సుజాత సెక్యూ రిటీ సర్వీసెస్‌ను రన్‌ చేస్తుంటాడు మధు. కానీ ఈ సెక్యూరిటీ సర్వీసెస్‌ వెనకాల దొంగతనాలు చేస్తుంటాడు. మధు దొంగ అని రమ్యకు తెలుస్తుంది. అయితే తాను ఏ విధంగా దొంగను కావా ల్సి వచ్చిందో కూడా, రమ్యకు మధు వివరించి చెబుతాడు. కానీ మధును దొంగతనాలు మా నేసి, ఉద్యోగం చేయమని మధును రమ్య బలవంతపెడుతుంది. కానీ తాను చేసే జాబ్‌తో వచ్చే జీతంతో మధు శాటిఫై కాడు. పైగా తన ఇంటిని తాను కాపాడుకోవాలంటే, ఈ జీతం అతనికి సరిపోదు. దీంతో గత్యంతరం లేక ఓ పెద్ద దొంగతనం ప్లాన్‌ చేస్తాడు. ఈ విషయం రమ్యకు తెలుస్తుంది. మధును అడ్డుకుంటుంది. కానీ మధు వినడు. ఈ క్రమంలో రమ్య కూడ మధుతో కలిసి దొంగతనంలో పాల్గొనాల్సి వస్తుంది. ఫ్రెండ్స్‌ చేసిన తప్పు వల్ల మధు ఆ పెద్ద దొంగ త నాన్ని సక్సెస్‌ఫుల్‌గా చేయలేకపోతాడు. అయితే ఈ దొంగతనం చేసే ప్రాసెస్‌ తనకు నచ్చిందని, థ్రిల్‌ ఇస్తుందని, ఇలానే దొంగతనాలు చేయమని మధును ప్రోత్సహిస్తుంది రమ్య. పైగా భర్తకు తాను ఓ తోడు దొంగగా మారుతుంది. మరి.. ఈ దొంగలైన భార్యభర్తలను హెడ్‌కానిస్టేబుల్‌ ఆశా మేరీ (సుమకనకాల) ఎలా పట్టుకుంది? మధు–రమ్యల దొంగతనాలు మానేశారా? అనేది థియేటర్స్‌లో చూడాలి.

విశ్లేషణ

వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు..అనేది నానుడి. అయితే ఈ చిత్రం లో తాను దొంగనని చెప్పకుండ రమ్యను పెళ్లి చేసుకుంటాడు మధు. ఆ తర్వాత జరిగిన సంఘ టనల సమాహారమే ఈ చిత్రం.

రమ్య–మధుల పెళ్లి చేసుకోవడం, మధు దొంగ అని రమ్యకు తెలియడం, ఇద్దరు కలిసి దొంగ తనాలు చేయాలనుకోవడంతో తొలిభాగం ముగుస్తుంది. ఇద్దరు కలిసి ఎలా దొంగతనాలు చేశా రు? ఎలా పట్టుబడ్డారు? వీరిపై కంప్లైట్‌ ఇచ్చింది ఎవరు? అన్న ప్రశ్నలకు ఆన్సర్స్‌గా సెకం డాఫ్‌ సాగుతుంది. క్లైమాక్స్‌ ఊహించదగినదే.

 

పెళ్లైన తర్వాత ఏం గొడవలు జరిగినా? ఎంత కోపం వచ్చినా కూర్చొని, ఓ చాయ్‌ తాగుతూ మాట్లాడుకుని సాల్వ్‌ చేసుకోవాలన్నది ఈ సినిమా బేసిక్‌ లైన్‌ అని చిత్రంయూనిట్‌ పేర్కొంది. కానీ ఈ సినిమాలో భార్యభర్తల ఎమోషన్, భార్యభర్తల అనుబంధం, భార్యభర్తల గిల్లిగజ్జాల కన్నా కూడ, ఈ క్రైమ్‌ ఎలిమెంట్‌పైనే దర్శకుడు నవనీత్‌ ఎక్కువగా ఫోకస్‌ చేసినట్లుగా కనిపి స్తుంది. మధ్యతరగతి కుటీంబీకుల ఆర్థిక సమస్యకు దొంగతనాలే మార్గమని దర్శకుడు చూపించడం బాగోలేదు. పైగా హీరో, హీరోయిన్లు..ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నడు వారు తమ అప్పులను తీర్చడానికి దొంగతనాన్నే ఎంచుకోవడం కరెక్ట్‌గా అనిపించదు. మధ్యలో ‘భలే దొంగలు’ సినిమా కూడ గుర్తుకు వస్తుంది. ఇటు ఆశా మేరీ ట్రాక్‌ కూడా ఆసక్తి కరంగా ఏమీ లేదు. ఆశా మేరీ క్యారెక్టర్‌ మ్యారీడ్‌ లైఫ్‌ సరైన విధంగా ఏస్టాబ్లిష్‌ కాలేదు.

నటీనటులు– సాంకేతిక నిపుణుల

మధు సూదనరావు పాత్రలో ప్రియదర్శి బాగానే మెప్పించాడు. ‘మల్లేశం, డార్లింగ్‌’ చిత్రాల్లో ప్రియదర్శి భర్త రోల్‌ చేశాడు. కానీ ఈ సినిమాలో కాస్త కొత్తగా ట్రై చేశాడు. ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేశాడు. రమ్యగా ఆనంది యాక్టింగ్‌ ఈ సినిమాకు మేజర్‌ హైలైట్‌. ప్రీ ఇంట్రవెల్, క్లైమాక్స్‌ సీన్స్‌లో ఆనంది నటన మెప్పిస్తుంది. ప్రియదర్శి–ఆనందిల మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని ఆసక్తికరంగానే ఉంటాయి. ఆశా మేరీగా సుమకనకాల రోల్‌ ఫర్వాలేదు. ఈ రోల్‌ నుంచి కాస్త విభిన్నమైన కామెడీ జనరేట్‌ అయ్యుంటే బాగుండేది. ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌కుమార్, పెట్రో లింగ్‌ పోలీస్‌ స్టాప్‌గా హైపర్‌ ఆది, ఆటో రామ్‌ప్రసాద్, ఖైదీగా రమేష్, రవివర్మ, ప్రసాద్‌…వారి వారి పాత్రల మేరకు యాక్ట్‌ చేశారు.

నవనీత్‌ శ్రీరామ్‌ డైరెక్షన్‌ ఒకే. క్రైమ్‌ ఎలిమెంట్‌పై కాకుండ, భార్యభర్తల స్ట్రాంగ్‌ ఎమోషన్స్‌పై మరింత ఫోకస్‌ పెట్టి ఉండాల్సింది. తొలి సినిమాతో దర్శకుడిగా నవనీత్‌ ఫర్వాలేదనిపించాడు. రాఘవేంద్ర ఎడిటింగ్‌ బాగుంది. విశ్వనాథ్‌ సినిమాటోగ్రఫీ ఒకే. లియోన్‌ జేమ్స్‌ మ్యూజిక్‌ థియే టర్స్‌లో బాగానే సౌండ్‌ చేసింది.

ఫైనల్‌గా…: భార్యభర్తల అనుబంధానికి క్రైమ్‌ను జోడించిన సినిమా కథ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చవచ్చు. కానీ మెజారిటీ ఆడియన్స్‌కు థియేటర్స్‌లో థ్రిల్‌ ప్రాప్తిం చదు.

 

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos