జాతిరత్నాలు సినిమాతో మిత్రమండలికి పోలిక వద్దు!

SPM
SPM

Web Stories

Mithra Mandali Trailer: ప్రియదర్శి హీరోగా చేసిన లేటెస్ట్‌ మూవీ ‘మిత్రమండలి’. నిహారిక ఎన్‌ఎమ్‌ ఈ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నారు. విష్ణు ఓఐ, రాగ్‌ మయూర్, ప్రసాద్‌ బెహరా, ‘వెన్నెల’ కిషోర్, సత్య, వీటీవీ గణేష్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. లే టెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. కామెడీ పంచ్‌లు, సరదా సంభాషణలు తప్ప పెద్దగా ట్రైలర్‌లో ఏమీ కనిపించలేదు (Mithra Mandali Trailer).

ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రియదర్శి చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యం సంతరించుకున్నాయి. ‘మిత్రమండలి’ సినిమాను ‘జాతిరత్నాలు’ సినిమాతో పోల్చవద్దని, ఈ చిత్రంలో సోషల్‌ సెటైర్‌ ఉందని, నవ్వులు మాత్రం గ్యారంటీ అని చెప్పారు. అయితే ఓ సోషల్‌ ఇష్యూని, ప్రియదర్శి ఈ సినిమాతో చెప్పాలనుకున్నారో తెలియా లంటే ఈ నెల 16న థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యే ‘మిత్రమండలి’ సినిమా చూడాలి.

బన్నీ వాసు సమర్పణలో కల్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్‌రెడ్డి తీగల ని ర్మించారు. ఎస్‌. విజయేందర్‌ (Mithra Mandali movie Director)ఈ సినిమాకు దర్శకుడు.ఆర్‌ఆర్‌ ధ్రువన్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos