‘వారణాసి’ స్టోరీ లీక్ చేసిన ప్రియాంక చోప్రా..!

Kumar NA

Web Stories

Priyanka Chopra leaked Mahesh Babu Varanasi movie story : తెలుగు సినిమాను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కలయికలో వారణాసి’ అనే సినిమా తెరకేక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ గురించి వచ్చే ప్రతి అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, రీసెంట్‌గా తన హాలీవుడ్ మూవీ ‘బ్లఫ్’ ప్రమోషన్లలో భాగంగా ‘వారణాసి’ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. “ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కాలంతో పాటు ప్రపంచమంతటా ప్రయాణించిన అనుభూతిని పొందుతారు” అని ఆమె పేర్కొన్నారు. ఇదొక అత్యుత్తమ టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ అని ఆమె కితాబు ఇవ్వడంతో సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతోంది.

గతేడాది విడుదలైన గ్లింప్స్‌తోనే రాజమౌళి తన విజన్‌ను చూపించినప్పటికీ, కథను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచారు. అయితే పాత్రల పేర్లు వింటుంటే ఈ కథ వెనుక బలమైన మైథాలజీ కనెక్షన్ ఉందని స్పష్టమవుతోంది. ఇలా పురాణ నేపథ్యం ఉన్న పేర్లను రాజమౌళి ఖరారు చేశారు. దీనికి తోడు మహేష్ బాబు రాముడి గెటప్‌లో ఉన్న ఫోటోలు లీక్ అవ్వడం ఈ యాక్షన్ అడ్వెంచర్‌పై క్యూరియాసిటీని మరింత పెంచేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ మూవీ ‘బ్లఫ్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గత కొంతకాలంగా వెస్ట్రన్ ప్రాజెక్టులకే పరిమితమైన ప్రియాంక, రాజమౌళి ‘వారణాసి’తో మళ్ళీ భారతీయ వెండితెరపై మెరవబోతోంది. రాజమౌళి విజువల్స్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi