బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హవా కొనసాగుతుంది. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లోని భారీ మూవీలో ప్రియాంకా చోప్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం పారితోషికంగా ప్రియాంకా చోప్రా రూ. 30 కోట్ల రూపాయాలను చార్జ్ చేస్తున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. చాలా మంది షాక్ అయ్యారు. ఓ హీరోయిన్ ఈ లెవల్లో చార్జ్ చేయడం అంటే అది మాములు విషయం కాదని ముక్కున వేలేసుకున్నారు.
కానీ ప్రియాంక ప్రతిభకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి. హృతిక్ రోషన్ హీరోగా నటించి, తన దర్శకత్వంలోనే ‘క్రిష్ 4’ తీయాలని రెడీ అయ్యాడు. ఈ సినిమా క్యాస్టింగ్ పనులను మొదలు పెట్టాడు హృతిక్‌రోషన్. ఈ సినిమాలోని ఓ మెయిన్ లీడ్ రోల్ కోసం ప్రియాంకా చోప్రాను అమెరికాలో కలిసి మాట్లాడాట హృతిక్. అయితే ఈ సినిమాకు కూడా ప్రియాంకా చోప్రా రూ. 30 కోట్ల రూపాయాలను
పారితోషికంగా అడిగారనే వార్తలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రియాంకా చోప్రా కెరీర్‌లో ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. హాలీవుడ్‌లోనూ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రియాంకా చోప్రాను హీరోయిన్‌గా తీసుకుంటే, ఆ సినిమాలు ఇంగ్లీష్‌లో కూడా రిలీజైతే, ప్రియాంకాను తీసుకోవడం అనేది తప్పక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇండియన్ ఆడియన్స్‌కూ ప్రియాంక తెలుసు. హాలీవుడ్ ఆడియన్స్‌కు తెలుసు.
మరోవైపు అల్లు అర్జున్– అట్లీ మూవీ కోసం మేకర్స్ ప్రియాంకా చోప్రాను సంప్రదించగా, ఆమె సున్నితంగా తిరష్కరించారనే టాక్ తెరపైకి వచ్చింది.