మీట్‌ మందాకిని!

Viswa
Priyankachopra Look From SSMB29

Web Stories

Priyankachopra Look in SSMB29: మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా (SSMB29) తెరకెక్కు తుంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్‌ నారాయణ, కార్తికేయ (దర్శకుడు రాజమౌళి తనయుడు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ వేడుకల ఈ శనివారం హైదరాబాద్‌ శివార్లలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఈ సినిమాకు సంబం« దించిన ఓ వీడియోను మేకర్స్‌ రిలీజ్‌ చేయనున్నారు.

ఈ భారీ ఫంక్షన్‌కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ను మేకర్స్‌ రివీల్‌ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని గ్లోబ్‌ట్రోటర్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటను శ్రుతీహాసన్‌ పాడారు. ఈ పాటకు ముందు, ఈ చిత్రం నుంచి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లుక్‌ను విడుదల చేశారు. కుంభ పాత్రలో ఆయన నటిస్తున్నట్లుగా తెలిపారు మేకర్స్‌.

తాజాగా, ఈ సినిమా నుంచి ప్రియాంకా చోప్రా లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌ (Priyankachopra Look in SSMB29). ఈ సినిమాలో మందాకిని అనే పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తున్నారని, తెలిపి, ఆమె ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. చీరకట్టుకుని గన్‌ ఫైరింగ్‌ చేస్తున్న ప్రియాంకా చోప్రా లుక్‌ ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్‌ల లుక్స్‌ బయటకు వచ్చిన నేపథ్యంలో, తర్వాత రాబోయే మహేశ్‌బాబు లుక్‌పై ఇండస్ట్రీలో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమాను 2027 మార్చిలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. ఇక ఈ సినిమాకు ఇప్పటికే గ్లోబ్‌ట్రోటర్‌, సంచారి, మహారాజా,జెన్‌3 వంటి టైటిల్స్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos