పవన్‌కల్యాణ్ (Pawankalyan) ‘హరిహరవీరమల్లు’ (Hariharaveeramallu) సినిమా ఈ నెల 24న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ పీరియాడికల్ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతిక్రిష్ణలు దర్శకులు. నిధీ అగర్వాల్ హీరోయిన్‌గా చేశారు. నాజర్, బాబీ డియోల్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ‘హరిహరవీరమల్లు’ సినిమాలోని తొలిపార్టు ‘హరిహరవీరమల్లు స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ సినిమా మరో ఐదు రోజుల్లో విడుదల కానుంది. ఏమ్ రత్నం (Producer AM Rathnam) సమర్పణలో అద్దంకి దయాకర్ రావు ఈ సినిమాను నిర్మించారు. ‘హరిహరవీరమల్లు స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ రిలీజ్ సందర్భంగా ఏఎమ్ రత్నం (Hariharaveeramallu producer AM Rathnam) మీడియా ముందుకు వచ్చి, మాట్లాడరు. ఆ విశేషాలు క్లుప్తంగా…..
- – ‘కర్తవ్యం, భారతీయుడు, హిందీలో జెంటిల్‌మేన్’ ఇలా నేను ఏ సినిమా చేసినా, ఈ చిత్రాల్లో వినోదం పాటుగా, సందేశం కూడా ఉంటుంది. ఆ తరహా సందేశం ఈ ‘హరిహర వీరమల్లు’ సినిమాలోనూ ఉంటుంది. నా కెరీర్‌లోనే సుదీర్ఘమైన సినిమా ఇది. గతంలో అజిత్‌తో నేను చేసిన ‘ఆరంభం’ సినిమా రెండున్నర సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు హరిహరవీరమల్లు సినిమా ఐదున్నర సంవత్సరాల వరకు పట్టింది. తొలుత ఈ సినిమాను రెండు పార్టులుగా అనుకోలేదు. 17వ శతాబ్ధం నేపథ్యం సినిమా ఇది. చెప్పాల్సిన కథ చాలానే ఉంది. మేం సినిమా తీస్తూనే ఉన్నాం. ఎక్కడో అక్కడ ముగింపు ఉండాలి కథ అని, రెండు పార్టులుగా అనుకుని, తొలిపార్టును ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నాం. రిలీజైన ట్రైలర్‌కు, టీజర్‌కు మంచి స్పదనలు వచ్చాయి. మా అబ్బాయి జ్యోతిక్రిష్ణ అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. నేను ఆశ్చర్యపోయాను.
- పవన్‌కల్యాణ్‌గారి సహకారం లేకపోతే ఈ సినిమా ఇంతదూరం వచ్చేది కాదు. మూడు కరోనాలను దాటాం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. ఇలాంటి వాటి వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. పవన్‌కల్యాణ్‌గారు తిరిగి సెట్స్‌కు రావాలనుకున్నప్పుడు చేసిన తొలి సినిమా మాదే. కొన్నిసార్లు ఆర్టిస్టులు కాల్షీట్స్ కూడా దొరకకపోవడంతో, ఎవరు అందుబాటులో ఉంటే వారిపై షూటింగ్ చేసి, ఆ తర్వాత గ్రాఫిక్స్‌లో చేశాం. నాజర్, సునీల్‌గార్ల పాత్రల చిత్రీకరణలప్పుడు ఈ సమస్య వచ్చింది.
- ఈ సినిమా ప్రయాణంలో కాస్త ఒత్తిడికి గురయ్యాను. నైజాంలో ఎవరు రిలీజ్ చేస్తున్నారు..వంటి బిజినెస్ వివరాల గురించి త్వరలోనే చెబుతాను. తక్కువకు వస్తే బాగుంటుంది కదా అని, కొందరు బయ్యర్స్ తక్కువ రేట్లకు అడుగుతున్నారు. బజ్ లేదని, చాలాకాలా క్రితం సినిమా అని మాట్లాడుతున్నారు. కానీ సినిమాపై మేం పూర్తి నమ్మకంతోనే ఉన్నాం.
- సినిమాలపై ప్యాషన్‌తో భారీ బడ్జెట్‌తో మేం సినిమాలు చేస్తున్నాం. అలాంటప్పుడు తక్కువ సినిమా టికెట్ ధరలతో, ఈ సినిమా చూపించమంటే కష్టం. ఆడియన్స్ దీన్ని అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. కామన్ ఆడియన్స్ టికెట్ రేట్లు ఎక్కువగా ఫీలైతే, తొలిరోజు కాకుండ, ఆ తర్వాత చూడొచ్చు. ఇండస్ట్రీ చాలా డ్రైగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్,
ఎగ్జిబ్యూటర్స్ ఎవరి దగ్గరా డబ్బులు లేవు. ఇలాంటి పెద్ద సినిమాలు వస్తే బాగానే ఉంటుంది. కొన్ని మీటింగ్స్‌లో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతు
న్నారు. కానీ..పెద్ద హీరోల, పెద్ద సినిమాలు వస్తే, ఆ డబ్బులతో థియేటర్స్ రన్ అవుతాయి. అప్పుడు ఆ థియేటర్స్‌లో చిన్న సినిమాలూ ఆడతాయి.Pawankalyan HariHaraVeeraMallu Trailer - ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు జీవో రావొచ్చు. అలాగే తెలంగాణలో చారిత్రక సినిమాలకైతేనే ఇస్తాం అన్నారు. మాది చారిత్రక సినిమాయే అని చెప్పాం. ఏపీలో జీవో వచ్చిన తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. సానుకూల నిర్ణయం వస్తుందనే ఆశిస్తున్నాం.
- హరిహరవీరమల్లు (Hariharaveeramalli Movie) సినిమా అనౌన్స్‌మెంట్ రాగానే, ఆ సినిమా హరిహరరాయలు, బుగ్గరాయల నేపథ్యంతో ఉంటుందని ప్రచారం సాగింది. కానీ ఈ చిత్రం పూర్తిగా కల్పిత కథ. ఇటీవల సాయి అనే వ్యక్తి, తన నవల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నామన్నట్లుగా మాట్లాడారు. ఆ నవల ఏంటో కూడా మాకు తెలియదు. అలా ఏమైనా ఉంటే..అధికారికంగా హక్కులు తీసుకునే చేస్తాం.