గేమ్ చేంజర్ (gamechanger) సినిమా నిర్మాతల్లో ఒకరైన శిరీష్ (Producer Sirish) హీరో రాంచరణ్ పై సంచలన వ్యాఖ్యలు (Ramcharan Gamechanger Issue) చేశారు. గేమ్ చేంజర్ సినిమా వల్ల నిర్మాతలుగా తాము ఎంతో నష్టపోయమని, ఇక తమ బతుకు అయిపొయిందను నాకున్నామనుకున్నామని, ఆ పరిస్థితి ల్లో రామ్ చరణ్ కానీ, ఈ చిత్రం డైరెక్టర్ శంకర్ కానీ తమకు కనీసం ఫోన్ కాల్ చేసి కూడ మాట్లాడలేదని అని అన్నారు శిరీష్. అంతేకాక… మేము వారి (హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ ) రెమ్యూన రేషన్స్ ని కూడ కొంత తిరిగి ఇవ్వమని అడగలేదని, వారు కూడా ఈ దిశగా ఏం స్పందించి మాట్లాడలేదని శిరీష్ ఆరోపించారు. అలాగే అదే టైమ్ లో వచ్చిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమా వల్ల.. గేమ్ చేంజర్ లాస్ లు కవర్ అయ్యాయని శిరీష్ చెప్పుకొచ్చారు. దీంతో గేమ్ చేంజర్ సినిమా టాపిక్ మరోసారి ఇండస్ట్రీ, సోషల్ మీడియా లో చర్చకు వచ్చింది.#
మరో వైపు.. గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ మరో సినిమా చేయకుండ, మూడు సంవత్సరాలు కష్ట పడ్డారని, నిజానికి గేమ్ చేంజర్ సినిమా కోసం ప్రొడ్యూసర్ లు ఏడాది మాత్రమే డేట్స్ అడిగారని, ఈ ప్రకారం రామ్ చరణ్ డైరీ లో రెండేళ్లు వృధా గా పోయాయాని… మంచి తనం కూడా ఈ రోజుల్లో మంచిది కాదని సోషల్ మీడియా లో రెస్పాండ్ అవుతున్నారు.. చరణ్ ఫ్యాన్స్.
రామ్‌చరణ్ గేమ్‌చేంజర్ మూవీ రాంగ్ స్టెప్..నా ఫెయిల్యూర్
ఈ వివాదం ఇలా ఉంటే మరోవైపు… గేమ్ చేంజర్ సినిమా ప్రధాన నిర్మాత అయిన దిల్ రాజు కూడా… గేమ్ చేంజర్ సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్ సినిమా తో రామ్ చరణ్ కు ఓ హిట్ మూవీ ఇవ్వలేదన్న బాధ తనకు ఉందని, రామ్ చరణ్ తో మరో సినిమా తీసి సూపర్ హిట్ ఇస్తామని, ఈ ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయని నిర్మాత దిల్ రాజు… తమ్ముడు సినిమా ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి… దిల్ రాజు సోదరుడు శిరీష్ మాటలను సీరియస్ గా తీసుకొని రామ్ చరణ్… దిల్ రాజు తో, మారో మూవీ చేయకుండా ఉంటారా? లేక..శిరీష్ మాటలను స్పోర్టివ్ గా తీసుకొని.. దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ తో మరో మూవీ చేస్తారా అనేది చూడాలి.
రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా 2025 సంక్రాంతి ఫెస్టివల్ కి విడుదలై, ప్లాప్ మూవీ గా నిలిచిన సంగతి తెలి సిందే. దిల్ రాజు, శిరీష్ లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. వీరి బ్యానర్ లో గేమ్ చేంజర్ మూవీ 50వ చిత్రం కావడం విశేషం. ఇక ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేయగా, ఎస్ జె సూర్య, జయరాం, శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి లు ఇతర కీ రోల్స్ చేశారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్.