Producer Vishwa Prasad: హీరో పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు ఎంత మంచి మిత్రుల్లో చెప్పాల్సిన అసవరం లేదు. ఇప్పటికీ పవన్‌కల్యాణ్ చేయాల్సిన సినిమాలను పరోక్షంగా త్రివిక్రమ్‌నే డిసైడ్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీలో చెప్పుకుటుంటారు. అంతేందుకు…పవన్‌కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ను సెట్ చేసింది కూడా త్రివిక్రమ్‌యే. పవన్ చేయాల్సిన ఓ రీమేక్ సినిమా కోసం దర్శకుడు సుజిత్‌ను త్రివిక్రమ్ సంప్రదించగా, ఆ సమయంలో సుజిత్ ‘ఓజీ’ అనే స్టోరీ పవన్‌కు చెప్పి, పవన్‌ను ఇంప్రెస్ చేసి, ఈ సినిమా సెట్ అయ్యేలా చేసుకున్నాడు. ఇలా ఓ రకంగా ‘ఓజీ’ సినిమాకు పునాది వేసింది త్రిక్రమ్‌నే.
అయితే పవన్‌కల్యాణ్‌కు (Pawankalyan) సంబంధించిన సినిమాల ఆర్థిక వ్యవహారాల్లో త్రివిక్రమ్ (Director Trivikram) పెద్దగా తల దూర్చింది లేదు. కానీ ఈ విషయంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (Producer Vishwa Prasad) రీసెంట్ టైమ్స్‌లో చాలా చురు గ్గా కనిపిస్తున్నారు. తమిళ సినిమా తెలుగు రీమేక్ ‘బ్రో’ సినిమా నుంచి పవన్‌తో టీజీ విశ్వ ప్రసాద్ స్నేహాం మొదలైనట్లుగా తెలుస్తోంది. పవన్‌కల్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రిలీజ్‌కు ముందు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ‘హరిహరవీరమల్లు’ సినిమా నిర్మాత ఏఏమ్‌రత్నం నిర్మించిన ‘ఆక్సిజన్’ సినిమా తాలుకూ నష్టాలను, ‘హరిహరవీరమల్లు’ సినిమాకు ముందే చెల్లించాలని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పట్టుబట్టారు. ఇలా రీలీజ్‌కు రెండు రోజుల ముందు ‘హరిహరవీరమల్లు’ సినిమాకు పెద్ద ఇబ్బందే ఎదురైంది. కానీ..ఈ విషయంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్రీయాశీలకంగా వ్యవహరించి, ‘హరిహరవీరమల్లు’ సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేశారు.
2024లో నిర్మాతగా వరుస అపజయాలను ఎదుర్కొన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TGViswaprasad), 2025లో తేజ సజ్జా ‘మిరాయ్’తో ఓ మంచి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందు కున్నాడు. కానీ ‘ఓజీ’ (OG Movie Review) సినిమా కోసం ఉత్తరాంధ్ర లొకేషన్స్‌లో ‘మిరాయ్’ ఆడుతున్న థియేటర్స్‌ను ‘ఓజీ’ సినిమాకు ఇచ్చేశాడు టీజీ విశ్వప్రసాద్. ఇలా పవన్‌కు ప్రతి ఆర్థికపరమైన విషయంలో అండగా నిలుస్తున్నారు టీజీ విశ్వ ప్రసాద్. ఇలా పవన్ చేయాల్సిన ప్రతి సినిమాకు ఆర్థికపరమైన విషయాల్లో క్రియాశీలకంగా ఉంటూ, ఈ విషయంలో త్రివిక్రమ్‌ను మించిపోలేలా వ్యవహరిస్తున్నాడు టీజీ విశ్వప్రసాద్.
ఇక 2021లో పవన్‌కల్యాణ్ నిర్మాణసంస్థ పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో, టీజీ విశ్వప్రసాద్ నిర్మాణసంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్‌ఎల్‌పీ సంస్థ…పదికి పైగా సినిమాలు చేసేందుకు అసోసియేట్ అయ్యింది. ఈ కాంబినేషన్‌లో ఇప్పటివరకు సినిమాలైతే రాలేదు కానీ, పవన్ కల్యాణ్‌తో టీజీ విశ్వప్రసాద్ అసోసియేషన్ అయితే బలంగా కొనసాగుతుంది.
The Ambitious Collaboration Between Pawan Kalyan Creative Works And People Media Factory LLP
మరోవైపు టీజీ విశ్వప్రసాద్ నిర్ణయంతో, జనసేన నేత బన్నీ వాసు కూడా అలరై్టపోయారు. వెంటనే…లిటిల్‌హార్ట్స్ ఆడుతున్న సినిమా థియేటర్స్‌లో ‘ఓజీ’ సినిమాను ప్రదర్శించుకోనేలా ఏర్పాట్లు చేశారు.