పూరీసేతుపతి షూటింగ్‌ పూర్తి

Viswa

Web Stories

PuriSethupathi: హీరో విజయ్‌సేతుపతి (Vijaysethupathi) , దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్‌లోని ‘పూరీసేతుపతి’ (వర్కింగ్‌ టైటిల్‌) (Puri Sethupathi) సినిమా చిత్రీకరణ పూర్తయింది. హీరోయిన్‌ సంయు క్తా, టబు, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, విజయ్‌కుమార్‌లు ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ ‘పూరీ సేతుపతి’ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లుగా మేకర్స్‌ తెలిపారు.

ఈ సినిమా ప్రారంభమైన ఐదు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి కావడం విశేషం. ఈ ఏడాది జూలైలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇప్పుడు డిసెంబరులో పూర్తయింది. ఇలా జెట్‌స్పీడ్‌లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇక ఈ సినిమాకు ‘బెగ్గర్‌’, ‘భవతిభీక్షాందేహీ’…వంటి టైటిల్స్‌ ను మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మోస్ట్‌లీ ఈ సినిమాకు ‘బెగ్గర్‌’ అనే టైటిల్‌ ఖరారు కానున్నట్లుగా తెలుస్తుంది. నిజానికి సెప్టెంబరు 28న పూరీ జగన్నాథ్‌ బర్త్‌ డే సంద ర్భంగా ఈ ‘పూరీ సేతుపతి’ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించాలనుకున్నారు మేకర్స్‌. కానీ సెప్టెంబరు 27న తమిళ హీరో విజయ్‌ స్థాపించిన రాజకీయపార్టీ కార్యక్రమంలో తొక్కిస లాట జరిగింది. కొంతమంది మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో ‘పూరీ సేతుపతి’ సినిమా టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అప్పట్లో చెన్నైలో క్యాన్సిల్‌ చేశారు.

ఇక పూరీసేతుపతి సినిమా వచ్చే వేసవిలో థియేటర్స్‌లో రిలీజ్‌ కానున్నట్లుగా తెలుస్తోంది. తెలు గు, తమిళం, కన్నడం,మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ‘అర్జున్‌ రెడ్డి, యానిమల్‌’ సినిమాలకు సంగీతం అందించిన హర్షవర్దన్‌ రామేశ్వర్‌ ఈ సినిమాకు సంగీ తం అందిస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos