purusha Movie: మళ్లీ రావా, జెర్సీ, మసూద వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన వీరు ఉలువల తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘పురుష’. యువ నటుడు పవన్‌కల్యాణ్ హీరోగా పరి చయం అవుతున్న ఈ సినిమాలో కసిరెడ్డి రాజ్‌కుమార్, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రల్లో నటిం చారు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఓ స్పెషల్‌సాంగ్‌తో ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారు చిత్రంయూనిట్
. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రంయూనిట్ బిజీగా ఉంది. ‘వెన్నెల’ కిశోర్, వీటీవీ గణేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రంయూనిట్ చెబుతోంది.