‘పుష్ప: ది రూల్’ (Pushpa2) సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప ది రూల్’ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మేకర్స్ విడుదల చేసిన బాక్సాఫీస్ లెక్కల ప్రకారం 1800 కోట్ల రూపాయాల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
Daaku Maharaaj: దబిడి దిబిడి..డాకు మహారాజ్‌కు డ్యామేజ్!
ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌తో… ఇక అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీ రికార్డు హిందీ చిత్రం ఆమీర్‌ఖాన్ ‘దంగల్’ పేరిట ఉంది. రూ. 1810 కోట్లతో ‘బాహుబలి2’ రెండో స్థానంలో ఉంది. అయితే ‘బాహుబలి 2’ (Baahubali 2: The Conclusion) రికార్డులకు పుష్పది రూల్ చిత్రం కేవలం పదికోట్ల రూపాయాల దూరంలోనే ఉంది. ‘పుష్ప: ది రూల్’ సినిమా ఇంకా ప్రదర్శించబడుతోంది కాబట్టి….మరో పది కోట్లు సాధించి, బాహుబలి 2 రికార్డులను అధిగమించడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఈ విధంగా ‘పుష్ప 2’ చిత్రం బాహుబలి 2 సినిమా రికార్డులను అధిగమించినట్ల వుతుంది.
Nandamuri Balakrishna Akhanda2: అఖండ 2 రిలీజ్ ఫిక్స్..కాంతారతో పోటీ

మరోవైపు పుష్ప ది రూల్ సినిమాకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్‌మైషో చెప్పిన ప్రకారం…పుష్ప ది రూల్ సినిమాకు 20 మిలియన్ల టికెట్స్ బుకైయ్యాయి (జస్ట్ టికెట్స్, పీవీఆర్.. ఆన్‌లైన్ టికెట్స్ పోర్టల్స్ కాకుండా..). ఇది కూడా ఓ రికార్డు. గతంలో 16.5 మిలియన్ల బుక్‌మై షో టికెట్స్ బుకింగ్‌తో యశ్ ‘కేజీఎఫ్ 2 (KGF2)’ రెండో స్థానంలో ఉండేది. ఈ రికార్డును తాజాగా ‘పుష్ప ది రూల్’ సినిమా చేరిపేసింది. ఇక మొత్తంగా ‘పుష్ప ది రూల్’ సినిమాకు దాదాపు ఆరుకోట్లమంది థియేటర్స్‌లో వీక్షించారనే టాక్ వినిపిస్తోంది.
NBK Unstoppable: కావాలనే చేశారా? బాలకృష్ణపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం!

ఇక ‘పుష్పది రూల్’ సినిమా హిందీలోనూ రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు రూ. 800 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌తో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘పుష్ప ది రూల్’ చిత్రం నిలిచింది. ఈ రికార్డు గతంలో ‘స్త్రీ 2’ పేరిట ఉంది. శ్రద్ధాకపూర్– రాజ్‌కుమార్ రావు లు నటించిన హార ర్ మూవీ ‘స్త్రీ 2’ చిత్రం 2024లో విడుదలై, కేవలం హిందీలోనే 650 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.
Chiranjeevi Movie: సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ ఎన్టీఆర్