పవన్‌కల్యాణ్‌ సినిమాలో రాశీఖన్నా

Viswa
Raashiikhanna in pawankalyan UBS Movie

2022లో వచ్చిన గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాల తర్వాత హీరోయిన్‌ రాశీఖన్నా(RaashiikKhanna )నుంచి మరో తెలుగు సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో ఓ హీరోయిన్‌గా చేస్తున్నారు రాశీఖన్నా. ఇందులో శ్రీనిధిశెట్టి మరో హీరోయిన్‌. స్టైలిస్ట్‌ నీరజకోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమా దీపావళి సందర్భంగా డిసెంబరు 17న రిలీజ్‌ కానుంది. అయితే తాజాగా రాశీఖన్నా తెలుగులో మరో కొత్త సినిమాకు సైన్‌ చేసింది.

పవన్‌కల్యాణ్‌ హీరోగా హరీష్‌శంకర్‌ డైరెక్షన్‌లో ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా తర్వాత మళ్లీ ‘ఉస్తాద్‌భగత్‌సింగ్‌’ అనే సినిమా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా శ్రీలీల యాక్ట్‌ చేస్తుండగా, మరో హీరోయిన్‌గా రాశీ ఖన్నాను తీసుకున్నారు మేకర్స్‌. ఈ సినిమాలో శ్లోక అనే పాత్రలో కనిపిస్తారు రాశీఖన్నా. ఆల్రెడీ ఆమె షూటింగ్‌లో జాయిన్‌ అయినట్లుగా తెలుస్తోంది. మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా విడుదల కావొచ్చు. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ పోలీసాఫీసర్‌గా చేస్తున్నాడు. తమిళ హిట్‌ విజయ్‌ ‘తేరీ’ సినిమాకు తెలుగు రీమేక్‌గా, ఈ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా రానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారట.

ఇలా ప్రజెంట్‌ రాశీఖన్నా తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. ఆసక్తికరంగా ఈ రెండు సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్స్‌ ఉండగ, వారిలో ఒకరిగా రాశీ చేస్తున్నారు. మరి..భవిష్యత్‌లో ఆమె సోలో హీరోయిన్‌గానూ, సినిమా చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *