RajinikanthCoolieReview:
రజినికాంత్ కూలీ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ మూవీ బిజినెస్ ట్రేడ్స్ లో దూసుకెళ్తుంది. కూలీ మూవీ బుకింగ్స్ ట్రేడ్ వర్గీయులనే షాక్ కు గురి అయ్యేలా చేస్తున్నాయి. రజినీకాంత్ గత చిత్రం సూపర్ హిట్ కాకపోయినా, ఈ కూలీ సినిమా మాత్రం ఆడియన్స్ దృష్టిలో పడింది. ఈ సినిమా లో నాగార్జున విలన్ రోల్ చేయడం, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, సౌబిన్ సాహిర్ వంటి బలమైన యాక్టర్స్ ఉండటం కూలీ సినిమా కు బలమైన కారణాలు గా కన్పిస్తున్నాయి.
ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ మార్క్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్కోర్, ఆమిర్ ఖాన్ క్యామియో వంటివి కూడా కూలీ కి కలిసోచ్చిన విషయాలే. సన్ పిక్చర్స్ అంటే నిర్మాణ విలువలకు డోఖా లేదు.
కూలీ మూవీ ప్రధానంగా స్నేహం, పగ అంశాలతో సాగె కథ గా తెలుస్తుంది. సత్యరాజ్ ప్లే చేసిన రాజశేఖర్ రోల్ ఈ సినిమా కు ఓ హార్ట్ అని ట్రైలర్ స్పష్టంగా చెబుతోంది. ఓ వాచ్ కంపెనీ ఓనర్ సైమన్(నాగార్జున)కు, ఓ బస్ కండక్టర్ దేవ (రజినీకాంత్) ఉన్న లింక్ ఏంటి? సైమన్ కంపెనీ లోకి దేవ ఎందుకు కూలీ గా మళ్ళీ జాయిన్ అవుతాడు? అన్నదే మెయిన్ కాన్ఫ్లిక్ట్ గా తెలుస్తుంది.
సినిమా లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దేవ (రజినీకాంత్ )- రాజశేఖర్ (సత్య రాజ్ )- సైమన్ (నాగార్జున )ల రోల్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ స్టోరీ ని ముందుకు డ్రైవ్ చేస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లోనే కాలీష్ గా ఉపేంద్ర కనిపిస్తారు. బస్ డ్రైవర్ గా ఉప్పి రోల్ ఉంటుంది. ఇక సత్య రాజ్ పాత్ర కు ఓ కూతురు పాత్ర గా ప్రీతీ గా శృతి హాసన్ రోల్ ఉంటుంది. రజిని- శృతి ల మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్ గా ఉండబోతున్నాయట.
విలన్ కు సపోర్ట్ గా ఉండే దయాల్ గా మలయాళ యాక్టర్ షౌబిన్ కనిపిస్తారు. మౌనిక సాంగ్ లో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. వాచ్ ల కంపెనీ నేపథ్యంలో మూవీ కాబట్టి, టైమ్ ట్రావెల్ – టైమ్ మిషన్, ఓ సైంటిస్ట్ (సత్య రాజ్ పాత్ర కావొచ్చు) వంటి కాన్సెప్ట్ కూలీ మూవీ లో కనిపించవచ్చు.
“కూలీ :ది పవర్ హౌస్ ” కాన్సెప్ట్ కూడా ఈ కూలీ మూవీ లో కీలకమే అని, అందుకే ఈ సినిమా కి హిందీ లో పవర్ హౌస్ అనే టైటిల్ ని పెట్టారని టాక్.
జైలర్ సినిమా లోని మాదిరి అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరో సారి రజినీకాంత్ యాక్టింగ్, స్టైల్ కి ప్లస్ గా నిలవనున్నాయి.
సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్స్ లోకి వస్తుంది. మరి మెజారిటీ ఆడియన్స్ కూలీ సినిమా గురించి ఎం జడ్జిమెంట్ ఇస్తారో చూద్దాం.