Coolie Review story: కథ
వైజాగ్ పోర్టులో అక్రమాలకు పాల్పడుతుంటాడు గ్యాంగ్‌స్టర్ సైమన్ (నాగార్జున). ఈ సైమన్‌కు రైట్‌హ్యాండ్ దయాల్ (షౌబిన్ సాహిర్). తన అక్రమ వ్యాపారాలకు అడ్డొచ్చిన వారిని సైమన్ చంపేస్తుంటాడు. దయాల్ కూడా క్రూరంగా వ్యవహిరిస్తుంటాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌తో సైమ్‌న్‌కు ఓ పని పడుతుంది. కానీ ఇంతలో రాజశేఖర్ మరణిస్తాడు. ఈ విషయంలో అజ్ఞాతంలో ఉన్న దేవ (రజనీకాంత్)కు తెలుస్తుంది. తన స్నేహితుడు రాజశేఖర్‌ది సహజ మరణం కాదని, హత్య అని తెలుసుకుని, ఇందుకు కారణమైన వారిని హతమార్చాలని దేవ నిర్ణయిం చుకుంటాడు. ఈ క్రమంలోనే రాజశేఖర్ కుమార్తెలు ప్రీతి (శ్రుతీహాసన్)కి ప్రాణహని ఉందని తెలుసుకున్న దేవా, వారిని కాపాడాలనుకుంటాడు. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దేవ ఎవరు? దేవ గతం ఏమిటి? దేవకు సైమన్‌కు ఉన్న లింక్ ఏమిటి? దహా (ఆమిర్‌ఖాన్), కాళీస్ (ఉపేంద్ర)లతో దేవాకు ఉన్న సంబంధం ఏమిటి? పోర్టులో సైమన్ చేస్తున్న నిజమైన స్మగ్లింగ్‌ను పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు? అన్నది మిగిలిన కథ (Coolie Review).
Coolie Review : విశ్లేషణ
దర్శకుడు లోకేష్ కనగరాజ్ అనగానే ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’లోని ‘ఖైదీ, లియో, విక్రమ్’ వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఎల్‌యూసీ నుంచి లోకేష్ బయటకు వచ్చి చేసిన తొలి సినిమా ‘మాస్టర్’. దళపతి విజయ్‌తో లోకేష్ చేసిన ఈ మాస్టర్ సినిమా అప్పట్లో సూపర్‌హిట్ కాలేదు. దీంతో ఎల్‌యూసీ నుంచి బయటకు వచ్చి, ఓ సినిమా తీసి హిట్ కొట్టడం లోకేష్‌కు కష్టమనే టాక్ వినిపించింది. ఈ దశలో లోకేష్ కనగరాజ్ రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేశాడు. కానీ ‘కూలీ’ సినిమా రిజల్ట్ ఆశించినంత అయితే లేదు.

నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, షౌబిన్ సాహిర్, ఆమిర్‌ఖాన్, పూజాహెగ్డే (స్పెషల్ సాంగ్)…ఇలా సూపర్‌డూపర్ ప్యాడింగ్ అండ్ స్టార్ యాక్టర్స్‌ని పెట్టుకుని, కూడా లోకేష్ ఓ రోటీన్ రివెంజ్ స్టోరీ రాసుకుని, అనిరుధ్ మ్యూజిక్‌పై ఆధారపడ్డట్లుగా అనిపిస్తుంది. తొలిభాగం వేగంగా సాగుతూ, ప్రీ ఇంట్రవెల్‌లో కాస్త ఆసక్తిని నెలకొల్పిన ఈ సినిమా, ఆ తర్వాత సడన్‌గా డ్రాప్ అవుతుంది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌ను దర్శకుడు లోకేష్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ప్లాఫ్‌బ్యాక్ ఏపిసోడ్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. రజనీ స్టైల్, స్వాగ్, మేనరిజమ్‌లనుస్క్రీన్‌పై సూపర్‌గా చూపించేందుకే లోకేష్ ఎక్కువ కష్టపడ్డాడు. కథ విషయంలో మాత్రం కాస్త ఉదాసీనతగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. సినిమాలో ఉన్న ప్రధాన పాత్రలన్నీ కూడా రజనీ స్టైల్, స్వాగ్‌ల ఎలివేషన్‌కు ఇచ్చుకునేందుకే వాడారు. ఎమోషన్ కూడ వర్కౌట్ అయి నట్లుగా కనిపించడం లేదు. మొబైల్ క్రిమేటర్ కాన్సెప్ట్ కూడా అంతంత మాత్రమే.
రజనీ మార్క్ స్టైట్ సీక్వెన్స్‌లు, మాస్ ఫైట్స్…ఇవి ఇష్టపడేవారికి అయితే ‘కూలీ’ సినిమా నచ్చుతుంది. కథలో డ్రామా, నాటకీయత..వంటివి మాత్రం ఆశించి, కూలీ సినిమాకు వెళ్లవద్దు. సైమన్‌గా నాగార్జున పాత్ర చాలా పవర్‌పుల్‌గా ఉంటుందని ఊహించారు. కానీ సైమన్ పాత్ర వెండితెరపై తేలి పోయింది. పైగా..దయాల్‌గా షౌబిన్ షాహిర్‌కు యాక్టింగ్ పరంగా మంచి మార్కులు పడ్డాయి. కథలో ఇంపార్టెన్స్ అలా ఉంది. పూజాహెగ్డే మోనికా స్పెషల్ సాంగ్ బాగుంది.
రజినీకాంత్ కూలీ సినిమా ఫస్ట్ రివ్యూ
ఎవరు ఎలా చేశారు
దేవాగా రజనీకాంత్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. రజనీకాంత్ ఎంట్రీ ఉన్న సీన్ వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పూనకాలే. రజనీ, స్టైల్, స్వాగ్, మేనరిజమ్…ఇలా ఏందులోనూ రజనీ ఫ్యాన్స్ నిరుత్సాహపడరు. విలన్ సైమన్ పాత్రలో నాగార్జున ఉన్నంతలో బాగానే చేశాడు. కానీ సైమన్ పాత్రకు కథలో బలం లేదు. అయితే దయాల్‌గా సౌబిన్ షాహిర్ యాక్టింగ్ పరంగా రెచ్చిపోయాడు. ఓ దశలో మెయిన్ విలన్ దయాల్‌నేనా? అనిపించలేలా యాక్టింగ్ ఇరగదీశాడు. సైంటిస్ట్ రాజశేఖర్ పాత్రలో సత్యరాజ్ ఎప్పట్నాలానే తన పాత్రపరధిమేర నటించాడు. రాజశేఖర్ కుమార్తె ప్రీతిగా శ్రుతీహాసన్ మంచి నటన కనబరచారు. అలాగే రెబ్బా మౌనికా జాన్, రచితారామ్‌లు కూడా ఫర్వాలేదు. కాళీస్ పాత్రలో ఉపేంద్ర, దహ పాత్రలో ఆమిర్‌ఖాన్ వారి వారి పాత్రల పరధి మేరకు చేశారు.
లోకేష్ కనగరాజ్ నుంచి ఇలాంటి ఓ రోటీన్ స్టోరీ ఆడియన్స్ ఊహించి ఉండరు. కథలో బలంగా ఉంటే ఎలివేషన్స్‌కు ఎలాగో స్కోప్ దొరకుతుంది. కథలో బలం లేనప్పుడే, ఇతర స్టార్ హీరోలు గెస్ట్‌లుగా మారిపోయి, సినిమాలోని మెయిన్ స్టార్ ఇమేజ్‌ను లేపేస్తుంటారు. ఈ కూలీ విషయంలోనూ ఇదే జరిగింది. కథలో బలం లేని నిజం కనిపిస్తుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గిరీష్ గంగాధరన్ కెమెరా వర్క్ బాగుంది. ఫిలోమిన్ రాజ్ ఇంకాస్త ఎండిటింగ్ చేయవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో. ఇక అనిరుధ్ మ్యూజిక్ ఈ కూలీ సినిమాకు మరో బలం. కానీ అన్నిచోట్ల కాదు. అక్కడక్కడ మాత్రమే. ‘జైలర్’ తరహా మ్యూజిక్‌ను ‘కూలీ’ కోసం క్రియేట్ చేయడంలో అనిరుధ్ కాస్త తడబడ్డాడనే చెప్పుకోవాలి.
ఫైనల్‌గా…రజనీకాంత్ ఫ్యాన్స్‌కు నచ్చే కూలీ
రేటింగ్ 2.25/5