టాలీవుడ్ నిర్మాత సంస్థ మైత్రీమూవీమేకర్స్ ఇతర ఇండస్ట్రీ యాక్టర్స్‌ని తెలుగులోకి తీసుకు రావడంలో ముందు ఉంది. ఆల్రెడీ అజిత్‌తో ‘గుడ్‌బ్యాడ్ అగ్లీ’, సన్నీ డియోల్‌తో ‘జాట్’ సినిమాలు తీశారు మైత్రీమూవీమేకర్స్. కన్నడ నటుడు రిషభ్‌శెట్టితో జైహనుమాన్ తీస్తున్నారు. తమిళ నటుడు ప్రదీప్‌రంగనాథన్‌తో ‘డ్యూడ్’ సినిమా చేస్తున్నారు. ఆమిర్‌ఖాన్, హృతిక్‌రోషన్ లతో సినిమాలు చేసేందుకు మైత్రీమూవీసంస్థ చర్చలు జరుపుతోంది. లేటెస్ట్‌గా….రజనీకాంత్ (Rajinikanth)పేరు తెరపైకి (Rajinikanth Telugu movie)వచ్చింది.
రజనీకాంత్ (Rajinikanth) తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ చేయనున్నారే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. రజనీ కాంత్‌తో ‘దిల్’ రాజు ఓ సినిమా చేస్తారనే ప్రచారం సాగింది. కానీ అది నిజం కాలేదు. ఇప్పుడు మైత్రీమూవీ మేకర్స్ సంస్థ రజనీకాంత్‌తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందనే టాక్ తెరపైకి వచ్చింది. తెలుగులో ‘బ్రోచెవారెవరురా, సరిపోదా శనివారం’ వంటి సినిమాలను తీసినదర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా చేయనున్నారంటూ, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తారంటూ ప్రచారం సాగుతోంది. ఈ సారన్న ఈ మూవీ ని జం కావాలని తెలుగు ఆడియన్స్ అయితే కోరుకుంటున్నారు.
ఇక రజనీకాంత్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’ (Rajinikanth coolie release date) ఆగస్టు 14న రిలీజ్‌కు రెడీ అయ్యింది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం జైలర్ 2 (Rajinikanth jailer 2) సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్.