Rajinikanth Jailer 2: రజనీకాంత్‌కా హుకుం జైలర్‌ 2

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లోని బ్లాక్‌బస్టర్‌ మూవీ 'జైలర్‌'కు సీక్వెల్‌గా 'జైలర్‌ 2' ను ప్రకటించారు.

Viswa
2 Min Read

రజనీకాంత్‌ (Rajinikanth)  కెరీర్‌ను మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కించిన మూవీ ‘జైలర్‌’ (Jailer). నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Deelipkumar) డైరె క్షన్‌లోని ఈ మూవీ 2023లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ. 650 కోట్ల రూపాయాలకు పైగా ఈ మూవీ గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. దీంతో అప్పట్నుంచే ‘జైలర్‌’ సినిమాకు, సీక్వెల్‌ (Rajinikanth Jailer 2) తీయాలని ఈ చిత్రం నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్‌ ప్లాన్‌ చేసింది.

Ramcharan GameChanger Movie Review: రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ మూవీ రివ్యూ

దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కూడా మరో సినిమాకు సైన్‌ చేయకండ, ‘జైలర్‌ 2’ (Jailer 2) స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో పడ్డాడు. డిసెంబరు 12న రజనీకాంత్‌ బర్త్‌ డే సందర్భంగా ‘జైలర్‌ 2’ మూవీ అప్‌డేట్‌ వస్తుందని, అంతా ఆశించారు. కానీ రాలేదు.

DaakuMaharaaj Review: డాకుమహారాజ్‌ రివ్యూ

దీంతో న్యూ ఇయర్‌ సందర్భంగా ‘జైలర్‌ 2’ అప్‌డేట్‌ని ఆశించారు రజనీకాంత్‌ ఫ్యాన్స్‌. కానీ అప్పుడు కూడా రాలేదు. అయితే ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా ‘జైలర్‌ 2’ మూవీని (Jailer 2  Announcement Teaser) అధికారికంగా ప్రకటించారు. ఓ పవర్‌ఫుల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘జైలర్‌ 2’ అనౌన్స్‌మెంట్‌ వీడియోకు ఈ చిత్రం దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్, సంగీత దర్శకుడు అనిరు«ద్‌ రవిచందర్‌లు తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం విశేషం.

Rajinikanth Jailer 2 Announcement Video
Rajinikanth Jailer 2 Announcement Video2

Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

ప్రస్తుతం రజనీకాంత్‌ ‘కూలీ’ (Coolie) మూవీ చేస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లోని ఈ మూవీ ఆగస్టులో రిలీజ్‌ కానుందనే ప్రచారం సాగు తోంది. ‘కూలీ’ సినిమా షూటింగ్‌ ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయింది. సో… ఎంటైర్‌ ‘కూలీ’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని ఊహింవచ్చు.

Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్‌ సూక్ష్మదర్శని రివ్యూ

 

Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *