Rajinikanth – Kamalhaasan multistarrer : రజనీకాంత్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోనుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ‘సైమా–2025’ అవార్డు వేడుకల్లో, రజనీకాంత్‌తో సినిమా చేస్తున్నట్లుగా, కమల్‌హాసన్ కన్ఫార్మ్ చేశారు (Rajinikanth – Kamalhaasan multistarrer ). ఇప్పుడు ‘జైలర్ 2’ సినిమా చిత్రీకరణ కోసం చెన్నై నుంచి అవుట్‌డోర్ వెళ్తున్న రజనీకాంత్‌ను ఈ ప్రా జెక్ట్ గురించి విలేకర్లు అడగ్గా, కమల్‌హాసన్‌తో సినిమా చేస్తున్నానని, ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మాణసంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్‌నేషనల్ (RaajKamalFilmsInternational), రెడ్ జెయింట్ మూవీస్ (RedGaintMovies) సంస్థలు (ఉధయనిధి స్టాలిన్ నిర్మాణసంస్థ) నిర్మిస్తాయని దర్శకుడు, కథ ఇంకా కన్ఫార్మ్ కాలేదని రజనీ కాంత్ స్పష్టం చేశారు. అలాగే ‘జైలర్ 2’ (Jailer2) తర్వాత ఈ సినిమా ఉండొచ్చని కూడ రజనీకాంత్ స్పష్టం చేశారు.
#Rajinikanth #KamalHaasan కాంబినేషన్ లో సినిమా ఫిక్స్pic.twitter.com/sRAe2Pm1xJ
— TollywoodHub (@tollywoodhub8) September 17, 2025
మల్టీస్టారర్ మూవీ?
కమల్‌హాసన్‌తో సినిమా చేస్తున్నట్లుగా రజనీకాంత్ చెప్పారు. కానీ ఈ సినిమా కమల్‌హాసన్ కూడా కలిసి నటిస్తారా? లేదా? అనే విషయంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. కమల్‌హాసన్ నెక్ట్స్ ఫిల్మ్ అరుణ్‌కుమార్‌తో ఉంటుంది. ఈ నెక్ట్స్ అన్బు అరివులతో కమల్‌హాసన్ సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కమల్‌హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్ చేసే సినిమా మల్టీస్టారర్ మూవీ కావాలని, అది రజనీకాంత్-కమల్‌హాసన్‌లతోనే జరగాలని ఈ ఇద్దరు సీనియర్ హీరోల ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
దర్శకుడు లోకేష్‌తోనే ఉంటుందా?
ఒకవేళ రజనీకాంత్–కమల్‌హాసన్‌లు కలిసి నటించి, సినిమా చేస్తే, ఆ సినిమాకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’ సినిమా తీసి, కమల్‌కు మంచి హిట్ ఇచ్చాడు లోకేష్. అలాగే రజనీకాంత్‌తో ‘కూలీ’ తీసి ఓ మోస్తారు హిట్ అందించాడు. అయితే రజనీకాంత్–కమల్‌ల సినిమాకు లోకేష్ సరైన కథ అందిస్తేనే, ఈ సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ ఉంటుందని లేకపోతే, మరో డైరెక్టర్ లైన్‌లోకి వస్తాడనే ప్రచా రం జరుగుతోంది.
46 సంవత్సరాల తర్వాత….
కెరీర్ మొదట్లో రజనీకాంత్–కమల్‌హాసన్‌లు కలిసి దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించారు. కానీ ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్ (1979)’ తర్వాత రజనీకాంత్– కమల్‌హాసన్‌లు కలిసి నటించలేదు. మళ్లీ ఇన్ని రోజులకు ఈ ఇద్దరు కలిసి నటించనున్నారు. అంటే 46 సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్–రజనీకాంత్‌లు కలిసి నటించనున్నారు.