Padayappa 2: రజనీకాంత్ (Rajinikanth) కెరీర్‌లో ‘పడియప్ప’ (Padayappa 2) (తెలుగులో ఈ చిత్రం ‘నరసింహా’గా విడుదలైంది) ఎంతటి బ్లాక్‌బస్టర్ సూపర్‌హిట్ సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను, ఈ డిసెంబరు 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా డిసెంబరు 12న, రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే రజనీ కాంత్ ఇండస్ట్రీలో నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కూడ ‘పడియప్ప’ చిత్రం రీ రిలీజ్ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా, శివాజీ గణేషన్, రమ్యకృష్ణ, సౌందర్య, అబ్బాస్‌లు ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
పడియప్ప రీ రిలీజ్ (Padayappa Re Release) సందర్భంగా ఈ సినిమాను గురించి, కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు రజనీకాంత్. ‘‘పడయప్ప’ సినిమాను నేనే నిర్మించాను. కానీ నిర్మాతలుగా నా ఫ్రెండ్స్ పేర్లు వేశాను. శాటిలైట్, ఓటీటీ రైట్స్ కూడ నా దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతం ‘పడియప్ప’ సినిమా సీక్వెల్‌కు చర్చలు జరుగుతున్నాయి. ఈ సీక్వెల్‌కు ‘నీలాంబరి’ అనే టైటిల్ అనుకుంటు న్నాము. ఇక ‘పడియప్ప’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర కోసం తొలుత ఐశ్వర్యారాయ్‌ని అనుకున్నాం. అయితే ఆమె ఈ పాత్ర చేసేందుకు ఆసక్తి చూపిచంలేదు. దీంతో ఆ సమయంలో రమ్యకృష్ణను సంప్రదించగా, ఆమె ఒప్పుకున్నారు. ‘పొన్నియిన్ సెల్వన్’ నవలలోని నందిని క్యారెక్టర్‌ను స్ఫూర్తిగా తీసుకుని, ‘నీలాంబరి’ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాం’’ అని చెప్పుకొచ్చారు రజనీకాంత్.
ఇక ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్ 2’ వచ్చే ఏడాది రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే కమల్‌హాసన్ నిర్మాణసంస్థలో రజనీకాంత్ ఓ సినిమా చేయాల్సి ఉంది. రజనీకాంత్ కెరీర్‌లో 173వ సినిమా ఇది. డిసెంబరు 12న రజనీకాంత్ బర్త్ డే. సో..జైలర్ 2 (Jailer2 Release), రజనీకాంత్ 173 సినిమాల అప్‌డేట్స్‌ను గురించిన వివరాలు అధికారికంగా బయటకు రావొచ్చు.