తమిళనాడులో రాజకీయపార్టీలు పెట్టి, సీయంలు అయిన హీరోలు ఉన్నారు. అలానే రాజకీయ పార్టీలు మొదలుపెట్టి, సక్సెస్ కానీ వాళ్లూ ఉన్నారు. అయితే రజనీకాంత్ (Rajinikanth) రెండో కోవలోకి వస్తారు. రజనీకాంత్ ఓ రాజకీయ పార్టీని స్టార్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని కొనసాగించలేకపోయారు. పార్టీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ (Coolie) మూవీ చేస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ బ్యాకాంక్‌లో జరగనుంది. జనవరి 13 నుంచి జనవరి 23 వరకు ‘కూలీ’ సినిమా చిత్రీకరణ బ్యాకాంక్‌లో జరగనుంది. ఇందుకోసం చెన్నై నుంచి బ్యాకాంక్‌కు బయలు దేరారు రజనీకాంత్. ఈ సమయంలో రజనీకాంత్‌ను కూలీ అప్‌డేట్స్ అడగ్గా, ‘‘కూలీ’ చిత్రీకరణ 70శాతం పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరుగుతుంది’’ అని చెప్పారు. అయితే అక్కడే ఉన్న మరికొందరు తమిళ స్టార్ హీరో విజయ్ కొత్తగా రాజకీయపార్టీ పెట్టారు. మీ అభిప్రాయం ఏంటి? అని అడిగారట. దీంతో రజనీకాంత్ కాస్త అసహనానికి లోనైయ్యారు. ‘నో మోర్ పాలిటికల్ క్వశ్చన్స్’ అంటూ కాస్త అగ్రహాంగా సమాధానం చెప్పారట. అది విషయం.
Vishal: విశాల్‌కు ఏమైంది..? మైక్ కూడా పట్టుకోలేకపోతున్నాడు?
ఇక రజనీకాంత్ హీరోగా చేస్తున్న ‘కూలీ’ మూవీలో ఉపేంద్ర, ఆమిర్‌ఖాన్, శ్రుతీహాసన్, నాగార్జున ఇతర లీడ్ రోల్స్‌లో చేస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘కూలీ’ మూవీని మే 1న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక కూలీ సినిమా పూర్తి కాగానే, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ‘జైలర్ 2’ (Jailer 2) చేస్తారు రజనీకాంత్. ఈ ఏడాదే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది.