Ramcharan Peddi: రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో ‘పెద్ది’ (RC16) (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే రాబోతోంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ ముగిసింది. మైసూర్‌లో ఒకటి, హైదరాబాద్‌లో మరోకటి చేశారు. వెంటనే కేరళలో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. కానీ రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ సినిమా జనవరి 10న రిలీజ్‌కు రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో రామ్‌చరణ పాల్గొనాల్సి ఉంది. దీంతో ఓ ఇరవై రోజులు చరణ్ ఈ గేమ్‌చేంజర్ చిత్రీకరణతో బిజీగా ఉంటారని ఊహించవచ్చు.
ఆ తర్వాత అంటే..జనవరి చివరిలో వారంలో ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో చరణ్ పాల్గొంటారు. చకా చకా షూటింగ్ పూర్తి చేసి, 2025 దీపావళికి ‘పెద్ది’ సినిమాను రిలీజ్ చేయాలన్నది చిత్రంయూనిట్ ప్లాన్ అని తెలిసింది. సుకుమార్‌రైటింగ్స్, మైత్రీమూవీమేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.
అలాగే ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్‌తో రామ్‌చరణ్ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను జూలైలో ప్రారంభించాలనుకుంటున్నారు.