Ramcharan Gamechanger: బ్రేక్‌ ఈవెన్‌కి గేమ్‌చేంజర్‌ ఎంత కలెక్ట్‌ చేయాలి?

Viswa
2 Min Read

Web Stories

రామ్‌చరణ్‌ గేమ్‌చేంజర్‌ (Ramcharan Gamechanger)మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ స్ట్రయిట్‌గా చేసిన తెలుగు ఫిల్మ్‌ ఇది. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘గేమ్‌చేంజర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ గురించి, ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. అసలు…గేమ్‌చేంజర్‌ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే ఎంత కలెక్ట్‌ చేయాలో చూద్దాం.

గేమ్‌చేంజర్‌ (Ramcharan Gamechanger PreRelease) మూవీకి దాదాపు రూ. 450 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా రూ. 80 కోట్ల రూపాయాలు, తెలంగాణలో మొత్తంగా రూ. 50 కోట్లు రూపాయాలు…ఇలా ‘గేమ్‌చేంజర్‌’కు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 130 కోట్ల రూపాయాల వరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. తమిళనాడు, కేరళలో రూ. 20 కోట్ల చొప్పున, కేరళలో రూ. 15 కోట్ల రూపాయాలు, ఇండియాలోని మిగతా ఏరియాస్‌లో మొత్తంగా రూ. 60 కోట్లు, ఓవర్‌సీస్‌లో రూ. 25 ఓట్ల రూపాయల చొప్పున గేమ్‌చేంజర్‌కు బిజినెస్‌ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Pawan Kalyan: నేనేప్పుడూ మూలాలు మర్చిపోను: పవన్‌కల్యాణ్‌

ఇలా ప్రపంచవ్యాప్తంగా గేమ్‌చేంజర్‌ (Ramcharan Gamechanger) మూవీకి రూ. 250 కోట్ల రూపాయాల బిజినెస్‌ జరిగింది. ఈ స్థాయి షేర్‌ కలెక్షన్స్‌ను సాధించా లంటే… గేమ్‌చేంజర్‌ చిత్రం దాదాపు రూ. 450 కోట్ల రూపాయాల కలెక్షన్స్‌ను సాధించాల్సి ఉంటుంది. అయితే సోలో హీరోగా రామ్‌చరణ్‌ హాయ్యెస్ట్‌ గ్రాస్‌ కలెక్ట్‌ మూవీ ‘రంగస్థలం’కు వచ్చింది రూ. 210 కోట్లు. మరి…గేమ్‌చేంజర్‌ ఏ స్థాయి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

సంక్రాంతి సినిమాల్లో గేమ్‌చేంజర్‌ మూవీ ముందుగా రిలీజ్‌ అవుతుండటం, ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలను పెంచడం, భారీ క్యాస్టింగ్‌ తదితర అంశాలు ‘గేమ్‌చేంజర్‌’కు ప్లస్‌ పాయింట్స్‌గా కనిపిస్తున్నాయి. మరి..ఏం జరుగుతుందో చూడాలి.

గమనిక: ఇక్కడ ప్రస్తావించిన ప్రీ రిలీజ్‌ లెక్కలు ప్రచారంలో ఉన్న వార్తల ఆధారంగా ఇవ్వబడినవి అని గమనించగలరు.

Please Share
3 Comments
Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos