Nani Next Movies: నాని డబుల్‌ సర్‌ప్రైజ్‌

Nani Next Movies: ఈ నెల 28న నాని బర్త్‌ డే సందర్భంగా రెండు కొత్త సినిమాల ప్రకటనలు వచ్చే చాన్సెస్‌ ఉన్నాయి.

Viswa
1 Min Read

Web Stories

హీరో నాని (Nani) రెండు కొత్త సినిమాలకు (Nani Next Movies) సైన్‌ చేసినట్లుగా తెలిసింది. తమిళంలో ‘డాన్‌’ వంటి హిట్‌ మూవీ తీసిన సిబి చక్రవర్తితో ఓ సినిమా చేయాలని నాని ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ సెట్‌ కావడం లేదు. ఫైనల్‌గా ఇప్పుడు కుదిరిందట. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో నాని ఓ మూవీ చేయ నున్నాడు. ఈ సినిమాకు సిబీ చక్రవర్తి పేరును సూచించారట నాని. ఈ నెల 24న నాని బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ మూవీని గురించిన అప్‌డేట్‌ రావొచ్చు.

అలాగే దర్శకుడు శేఖర్‌కమ్ములతో కూడా ఓ మూవీ చేయాలన్నది నాని అభిలాష. అప్పుడప్పుడు చర్చలు జరిగాయి కానీ ఈ మూవీ అయితే ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కానీ ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని, నాని– శేఖర్‌కమ్ముల కాంబినేషన్‌లోని మూవీ అనౌన్స్‌మెంట్‌ అతి త్వరలో రానుందని తెలిసింది. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తారని టాక్‌. గతంలో నాని చేసిన ‘ఎమ్‌ సీఏ’లో సాయిపల్లవి హీరోయిన్‌గా చేశారు.

ఇక ప్రస్తుతం నాని ‘హిట్‌ 3’ మూవీతో బిజీగా ఉన్నాడు. శేలైష్‌ కొలను డైరెక్షన్‌లోని మూవీ మే1న రిలీజ్‌ కానుంది. తనకు దసరా వంటి హిట్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ ఓదెలతో ‘ప్యారడైజ్‌’ మూవీ చేస్తారు నాని. ‘సాహో’ డైరెక్టర్‌ సుజిత్‌తోనూ నానికి ఓ మూవీ కమిట్‌మెంట్‌ ఉంది. ఇంకా ‘బలగం’ ఫేమ్‌ వేణు ఎల్దండితో నాని ఓ మూవీ చేయాల్సింది. ‘ఎల్లమ్మ’ టైటిల్‌తో ఉన్న ఈ చిత్రానికి ‘దిల్‌’ రాజు నిర్మాత. కానీ లాస్ట్‌ మినిట్‌లో ఈ మూవీ నితిన్‌ చేతిలో పడింది.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi