యాక్టర్‌గా రామ్‌చరణ్ ట్రాన్ఫర్మేషన్స్ ఎప్పుడూ నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ధ్రువ సినిమా కోసం, రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్…సినిమాల కోసం రామ్‌చరణ్ మేకోవర్ పరంగా ఎంత కష్టపడ్డారో, ఎలా ట్రాన్ఫార్మ్ అయ్యారో ఆడియన్స్‌కు తెలుసు. ఈ సారి అంతకుమించి ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్ అంతకుమించి కష్టపడుతున్నారు. ‘పెద్ది (Peddi)’ సినిమా కోసం రామ్‌చరణ్ మేకోవర్ (Ramcharan makeover Peddi) అవుతున్న లేటెస్ట్ ఫోటోనే ఇందుకు నిదర్శనం.
Global Star @AlwaysRamCharan is undergoing a rigorous training and transforming himself for #Peddi 💥💥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.#rc16 #RamCharan#Buchhibabu#Janhvikapoor
@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla… pic.twitter.com/tHEd09gGQP
— TollywoodHub (@tollywoodhub8) July 21, 2025
రామ్‌చరణ్ (Hero Ramcharan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఆట కూలీగా కనిపిస్తారు. అంటే కథ రిత్యా…ఈ సినిమాలో కుస్తి, ఖోఖో, ముఖ్యంగా క్రికెట్, రెజ్లింగ్…వంటి ఉంటాయి. ఏ ఆట ఉంటే..ఆ ఆట ఆటగాడిగా వెళ్లి, కూలీ డబ్బులు తీసుకునే క్యారెక్టరైజేషన్ అంట రామ్‌చరణ్‌ది. ముఖ్యంగా క్రికెట్, కుస్తి నేపథ్యాల్లో ఈ ‘పెద్ది’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. తొలిభాగం విభిన్న రకాల స్పోర్ట్స్ నేపథ్యం, మలిభాగం ఓ ఫ్లాష్‌బ్యాక్, ఈ తర్వాత కుస్తీ నేపథ్యంతో ఈ మూవీ కథనం ఉంటుందట. ఈ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. ఇందులో అన్నదమ్ములుగా కనిపిస్తారట రామ్‌చరణ్.

ఈ పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్, మైసూర్ లోకేషన్స్‌లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. త్వరలోనే నార్త్‌లో అంటే..ఢిల్లీలో ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ కోసమే రామ్‌చరణ్ ఇలా ట్రాన్ఫార్మ్ అవుతున్నారు. ఇంకా ఈ పెద్ది సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్ కాగా, శివరాజ్‌కుమార్, దివ్వేందు, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీమూవీమేకర్స్‌ల సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ సినిమాను మార్చి 26న రిలీజ్‌కు రెడీ కానుంది.
ఈ పెద్ది సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్‌తో సినిమా చేస్తారు రామ్‌చరణ్. అలాగే తన భవిష్యత్ సినిమాల కోసం కూడా రామ్‌చరణ్ కొన్ని కథలు వింటున్నారు.