Ramcharan NaaanaaHyraanaa: తమిళ దర్శకుడు శంకర్ సినిమాల్లోని సాంగ్స్ చాలా గ్రాండియర్‌గా ఉంటాయి. శంకర్ దర్శకత్వంలోని ‘జీన్స్’ సినిమాలోని ‘పువ్వుల్లో దాగే..’ పాట కోసం ఏడు వింతల లొకేషన్స్‌ను షూట్ చేశారు. ‘ఐ’సినిమాలో ‘పూలనే కునుకేయమంట…’పాట…ను చైనాలో తీశారు. ఈ సాంగ్ విజువల్ ఫీస్ట్‌గా ఉంటుంది.ఇక ‘రోబో 2’ చిత్రంలోని ‘హరిమా హరిమా…’ సాంగ్ ఖర్చు అప్పట్లో 15 కోట్ల రూపాయాలట. ఇలాంటి గ్రాండియర్ సాంగ్‌ను తన లేటెస్ట్ మూవీ ‘గేమ్‌చేంజర్’లోనూ శంకర్ పెట్టారు. ‘నానా హైరానా..’ అంటూ ఈ సాంగ్ సాగుతుంది. న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్‌ఖర్చు పదిహేనుకోట్ల రూపాయాలని ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. రామజోగయ్యశాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అం దించారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. కార్తీక్, శ్రేయాఘోషల్ తెలుగు వెర్షన్ పాటను పాడారు (Ramcharan NaaanaaHyraanaa)
#NaanaaHyraanaa out now♥️🤗https://t.co/baRNc0JB7R
A @MusicThaman melodic spell
Sung by: @shreyaghoshal @singer_karthik
Choreography: @BoscoMartis
Lyrics ✍️: @ramjowrites #GameChangerOnJAN10@AlwaysRamCharan @advani_kiara @yoursanjali @iam_SJSuryah
— TollywoodHub (@tollywoodhub8) November 28, 2024
ఇక గేమ్‌చేంజర్ విషయానికి వస్తే…రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ, ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో రామ్‌చరణ్‌కు జోడీగా అంజలి నటించారు.ఈ పొలిటికల్ యాక్షన్ మూవీనికి జీస్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్‌నిర్మించారు. ‘గేమ్‌చేంజర్’ సినిమా 2025 సంక్రాంతి సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. మరి.. ‘నానా హైరానా..’ సాంగ్ థియేటర్స్‌లో ఆడియన్స్‌కు ఎలాంటి విజువల్‌ఫీస్ట్‌గా ఉండబోతుందో చూడాలి.