పెద్ది ఇంట్రడక్షన్ సాంగ్ (Peddi Song) సూపర్ మాస్ లెవల్లో ప్రారంభమైంది. రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో రాబోతున్న పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం రామ్‌చరణ్ పాల్గొనగా,ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో 1000మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటుండగా, జానీ మాస్టర్ ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ‘పెద్ది’ సినిమాలో ఇది ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలిసింది. ఇక పెద్ది సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్ కూడా మైసూర్‌లోనే జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.
జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పెద్ది (Peddi) సినిమాలో జగపతిబాబు, దివ్వేందు శర్మ, శివరాజ్‌కుమార్‌లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నా రు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఈ పెద్ది సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగుతుంది. ఈ మైసూర్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే, నార్త్‌లో షూటింగ్ షురూ చేస్తారు పెద్ది టీమ్. ఢిల్లీలో ఓ పెద్ద లాంగ్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. నార్త్‌లో మరో రెండుమూడు లొకేషన్స్‌లో కూడా చిత్రీకరణలు జరుగుతాయి. ఈ నార్త్ లొకేషన్స్‌లో షూటింగ్ అయిపోతే, పెద్ది సినిమా మేజర్ టాకీ పార్టు పూర్తయినట్లే. ఆ తర్వాత వరుసగా సాంగ్ షూటింగ్స్ జరిగితే, ఈ సినిమా పూర్తవుతుంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీమూవీమేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పెద్ది సినిమా మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఆ పెద్ది సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత, దర్శకుడు సుకుమార్‌తో సినిమా చేస్తాడు రామ్‌చరణ్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులుదుబాయ్‌లో జరుగుతున్నాయి. ఇటీవల రామ్‌చరణ్ కూడా దుబాయ్ వెళ్లి, ఈ సినిమా స్క్రిప్ట్‌ను గురించిన చర్చల్లో పాల్గొన్నారని తెలిసింది.వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తారు. రంగస్థలం వంటి సూపర్‌హిట్ తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.