హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌తో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా (RC16) తెరకెక్కనుంది. ఈ మూవీలో క్రికెట్, కబడ్డీ, కుస్తీ…ఇలా మల్టీస్పోర్ట్స్ ప్రస్తావన ఉంటుంది. అయితే కథ రిత్యా ఈ సినిమాలో రామ్‌చరణ్ మల్టీస్పోర్ట్స్ ట్యాలెంటెడ్ పర్సన్‌గా కనిపించనున్నారని తెలిసింది. అంటే…క్రికెట్, కబడ్డీ, కుస్తీ…ఇలా ఏ ఆటనైనా ఆడగల క్రీడాకారుడు అన్నమాట.
ఛలో నార్త్ ఇండియా
‘పెద్ది’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ చిత్రీకరణ షూ టింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు ఈ మూవీ చిత్రీ కరణ హైదరాబాద్‌లో జరిగింది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ నార్త్ ఇండియాలో ప్రారంభం కానున్నట్లుగా తెలిసింది. ఢిల్లీ, హర్యానా వంటి లోకేషన్స్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుంది. ఈ లొకేషన్స్‌లో కుస్తీ, కబడ్డీ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది.
ఆ రోజు రిలీజ్?
మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. జగపతిబాబు, బాలీవుడ్ యంగ్ యాక్టర్ దివ్యేందు, కన్నడ సీనియర్ యాక్టర్ శివరాజ్‌కుమార్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. కాగా ‘పెద్ది’ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా అక్టోబరు 16, 2025న రిలీజ్ చేయ నున్నట్లుగా తెలిసింది.
బర్త్ డేకి టీజర్
మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమా టీజర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నా యి. అలాగే ‘రంగస్థలం’ సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్‌తో రామ్‌చరణ్ మరో మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్‌డేట్ కూడా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా రావొచ్చనే టాక్ విని పి స్తోంది. అలాగే ఇద్దరు బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసే యోచనలో ఉన్నారట రామ్‌చరణ్. మరి.. బాలీవుడ్ సినిమాల అప్‌డేట్స్ కూడా ఏమైనా వస్తాయా? అనేది చూడాలి.