ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రివ్యూ..అభిమాని థియేటర్‌ కట్టాడా?

Viswa

Web Stories

సినిమా : ఆంధ్ర కింగ్‌ తాలూకా (AndhraKingThalukaReview)

ప్రధాన తారాగణం: రామ్‌పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీబోర్సే, మురళీ శర్మ, సత్య, రావు రమేష్, రాహుల్‌ రామకృష్ణ
కథ–స్క్రీన్‌–ప్లే దర్శకత్వం: మహేశ్‌బాబు. పి
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌
సంగీతం: వివేక్‌ అండ్‌ మెర్విన్‌
కెమెరా: సిద్దార్థ నుని
ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
విడుదల తేదీ: 28-11-2025
నిడివి:2 గంటల 46 నిమిషాలు
రేటింగ్‌:2.5/5

కథ

స్టార్ గా వెలుగొందిన సూపర్ స్టార్ సూర్య కుమార్ (ఉపేంద్ర ) వరుసగా తొమ్మిది ప్లాప్ లతో ఇబ్బంది పడుతుంటాడు. అతని 100 సినిమా కూడా ఆగిపోయింది. ఈ సినిమా కంప్లీట్ కావాలంటే రూ. 3 కోట్ల కావాలి. సూర్య ఎంత ట్రై చేసిన డబ్బు సెట్ అవ్వదు. కానీ సడన్ గా సూర్య అకౌంట్ లో రూ. 3 కోట్లు క్రెడిట్ అవుతాయి. ఈ మనీ సూర్య అకౌంట్ లో వేసింది ..సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. సాగర్ (రామ్ )అని యాక్టర్ సూర్య కుమార్ కి తెలుస్తుంది. గోడపల్లి లంక కు చెందిన సాగర్ గురించి సూర్య ఏం తెలుసుకున్నాడు? సాగర్ – మహాలక్ష్మి (భాగ్య శ్రీ బొర్స్)ల ప్రేమ కథ ఏంటి? సాగర్ తన సొంత ఊర్లో ఎందుకు థియేటర్ కట్టాలనుకున్నాడు? సూర్య వందో సినిమా కి, సాగర్ థియేటర్ కి ఉన్న లింక్ ఏంటి? అన్నదే మిగిలిన కథ (AndhraKingThalukaReview)

విశ్లేషణ

2002 లో జరిగే కథ ఇది. ఒక నిజమైన ఫ్యాన్ ఎమోషన్ ని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా లో చక్కగా చూపించాడు డైరెక్టర్ పి.మహేష్ బాబు. ఫ్యాన్ ఎమోషన్ ఎలిమెంట్ నే కాకుండా, ఆ టైమ్ లోని లవ్ స్టోరీ, ధనిక – పేద వర్గాల మధ్య అసమానతలు, చదువు ఇంపార్టెన్స్, ఆత్మ గౌరవం, ఊరి పరువు… వంటి అంశాలను కరెక్ట్ గా బ్లెండ్ చేయడం లో సక్సెస్ అయ్యాడు.

ఆంధ్ర కింగ్ సూర్య ఎంట్రీ తో సినిమా స్టార్ట్ అవుతుంది. సాగర్ ఎంట్రీ, సాగర్ – మహాలక్ష్మి ల లవ్ ట్రాక్, మహాలక్ష్మి ఫాదర్ పురుషత్తమ్ తో థియేటర్ కడతానని సాగర్ ఛాలెంజ్ చేయడం తో ఇంట్రవెల్ కార్డు పడుతుంది. సాగర్ థియేటర్ ఏలా కట్టాడు? సాగర్ ఫేస్ చేసిన ప్రోబ్ల్మ్స్ ఏంటి? వంటి అంశాలతో సెకండ్ హాఫ్ సాగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ బాగుంది. ఫ్యాన్స్ వార్ జోల్లికి వెళ్ళకుండ టీమ్ మంచి కేర్ తీసుకున్నారు.

AndhrakingThaluka Rampothineni and Bhagyasreeborse

ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే. రామ్ ఎంట్రీ లేట్. రామ్ – భాగ్య ల లవ్ ట్రాక్ చూపించిన తీరు ఓకే. కానీ కొత్త గా లేకపోవడం మైనస్. స్టోరీ లో కొన్ని ఊహత్మక సన్నివేశాలు ఉన్నాయి. కానీ స్క్రీన్ ప్లే బావుంది.రాజమండ్రిలాంటి ప్లేస్‌ను వదలి, అదీ పడవ ప్రయాణం చేసి మరీ గొడపల్లి అనే లంక గ్రామానికి వెళ్లి ఆడియన్స్‌ ఎందుకు సినిమాను చూస్తారనే విషయాన్ని కన్విన్సింగ్‌గా చూపించలేదు. హీరో హీరోయిన్లు మధ్య ఫస్ట్‌హాఫ్‌లో ఉన్న కెమిస్ట్రీ, సెకండాఫ్‌ మిస్‌ అయ్యింది. సెకండాఫ్‌ అంతా కూడా ఎమోషనల్‌ ట్రాక్‌లో వెళ్లడం అనేది కూడ చూసే ఆడియన్‌కు కాస్త ఇబ్బందే. (AndhrakingThaluka Story)

నటి నటులు – సాంకేతిక నిపుణులు

సాగర్ గా రామ్ (Ram pothineni) యాక్టింగ్ బాగుంది. ఇంట్రవెల్ సీన్ లో మంచి యాక్టింగ్ చూపించాడు. ఎమోషనల్, లవ్ సీన్స్ లో మెప్పించాడు. మహా లక్ష్మి రోల్ లో భాగ్య శ్రీ (Bhagyashri Borse) ఉన్నంత లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. సాంగ్స్ లో గ్లామర్ గా కనిపించింది. రామ్ – భాగ్య ల కెమిస్ట్రీ కుదిరింది. థియేటర్ యజమాని హీరోయిన్ ఫాదర్ పురుషోత్తమ్ గా మురళి శర్మ మంచి ఇంపార్టెన్స్ రోల్ చేశాడు.

ఆంధ్ర కింగ్ వైస్ ప్రెసిడెంట్- జర్నలిస్ట్ ఈశ్వర్ గా రాహుల్ రామకృష్ణ యాక్ట్ చేశారు. కథ లో కీ రోల్ ఇది. కథ ను ముందుకు నడిపించే రోల్. పి. సాగర్ (రామ్ ) తల్లి పుష్పగా తులసి, తండ్రి సింహాద్రి గా రావు రమేష్ నటించారు. సెకండ్ హాఫ్ లో రావు రమేష్ తో ఉన్న ఓ సీన్ సూపర్ గా ఉంటుంది. సూర్య కుమార్ మేనేజర్ విష్ణు రోల్ లో రాజీవ్ కనకల, కలెక్టర్ గా వీటీవీ గణేష్, నిర్మాత గా రఘుబాబు, అనంత శ్రీరామ్, కాలేజీ ప్రిన్సిపాల్ శివ గా హర్ష వర్ధన్, టికెట్ కౌంటరిస్ట్ గా కమెడియన్ సత్య, గోడపల్లి లంక పెద్ద మనిషి గా నాగ మహేష్.. వారి వారి పాత్రల మేరకు నటించారు.

ఈ సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది. మరీ…ముఖ్యం గా మ్యూజిక్ సూపర్. వివేక్-మెర్విన్ లు తమ తొలి తెలుగు సినిమా తోనే సక్సెస్ అయ్యారు. ఆర్ ఆర్ కూడా బాగుంది. డైరెక్టర్ పి. మహేష్ బాబు సినిమా ను బాగా తీసాడు. ‘ప్రేమ కి, అభిమానానికి పరిచయాలు ఉండాలా ఏంటి?’, తన కష్టాన్ని ఎదురీదా గలిగిన వాడే నిజమైన హీరో’.. వంటి డైలాగ్స్ సినిమా లో ఉన్నాయి. సిద్ధార్థ ముని కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది.

ఫైనల్లీ : ఎమోషనల్ ఫ్యాన్ బయోపిక్ సినిమా ఇది. అభిమానం, సక్సెస్‌, చాలెంజ్‌, త్యాగం వంటి అంశాలతో ముడిపడిన భావో ద్వేగాలా కథ సినిమా. ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు. టోటల్ గా రామ్ కమ్ బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. (AndhrakingThaluka MovieReview)

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos