హిందీలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘రామాయణ (Ramayana Announcement)’. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు నితేష్ తివారి (Nitesh tiwari) దర్శకుడు. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, ఈ సినిమా వీడియోను విడుదల చేశారు. అలాగే ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌కపూర్ (Ranbir kapoor), లక్ష్మణుడిగా రవి దుబే (Ravie Dubey), సీత (Sai pallavi)గా సాయిపల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ (Sunny Deol), రావణుడిగా యశ్ కనిపించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ రామాయణ సినిమా అనౌన్స్‌మెంట్ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. యశ్ మాస్టర్ మైండ్స్ నిర్మాణసంస్థతో కలిసి నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐ మాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.మేజర్ షూటింగ్ సెట్స్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇక రామాయణ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది. తొలిపార్టు ‘రామాయణ పార్టు 1’ (Ramayana part1) వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా, రామాయణ పార్టు 2 (Ramayana part 2) ఆపై ఏడాది అంటే 2027లో విడుదల అవుతుంది. ఇంకా ఈ రామాయణ సినిమా కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శూర్పణక పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్, కైకేయి పాత్రలో లారా దత్తా, మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్‌లు కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్, హాన్స్‌జిమ్మెర్‌లు సంగీతం అందిస్తున్నారు.